ఏపీ: సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ బ్యాన్?
శాంతి భద్రతలను కాపాడతానని చంద్రబాబు... తెలుగు తమ్ముళ్లను గాలికి వదిలేశాడు. దీంతో ఏపీలో.. విధ్వంస కాండ కొనసాగుతోంది. ఇక... ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే మీడియాపై కూడా ఆంక్షలు విధిస్తోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. వైసిపికి గత ఐదు సంవత్సరాల పాటు అనుకూలంగా ఉన్న మీడియా ఛానలను... బ్యాన్ చేయిస్తోందట తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న ఎన్టీవీ ఛానల్ అలాగే 10 టీవీ ,టీవీ9 ఏపీలో బ్యాన్ చేస్తున్నారట.
అయితే వైసీపీ పరిపాలనలో... ఎల్లో మీడియా సంస్థలను కూడా జగన్మోహన్ రెడ్డి బాన్ చేశారు. కేబుల్ ఆపరేటర్లతో మాట్లాడి... ఏబీఎన్ ఛానల్, ఈటీవీ, టీవీ5 మరియు మహా టీవీ లాంటి ఎల్లో మీడియా ఛానల్ లను... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్యాన్ చేయించింది. ఇక్కడ కూడా ఏపీలో... ఆ ఛానల్ లను కనిపించకుండా ఉక్కు పాదం మోపింది జగన్ ప్రభుత్వం. ఇక ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది.
బ్లూ మీడియా అంటూ మొదటి నుంచి వైసిపి అనుకూల ఛానల్లను తెలుగుదేశం టార్గెట్ చేసింది. అందులో టీవీ9, ఎన్టీవీ మరియు 10 టీవీ , సాక్షి ఛానల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు ఛానల్ ను కూడా ఏపీలో బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తోంది తెలుగుదేశం కూటమి. ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లతో కూడా చర్చించారట. అయితే ప్రజాస్వామ్యంలో.. మీడియాకు స్వేచ్ఛ ఉండాలి. కానీ ఏపీలో మాత్రం... ఈ ప్రభుత్వం వచ్చినా... మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. అసలు ప్రజాస్వామ్యం ఏపీలో లేకుండా... జగన్ అలాగే చంద్రబాబు సర్కార్లు వ్యవహరిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.