పవన్: ఎగ్జిట్ పోల్స్ అయినా.. సర్వే అయినా గెలుపు పై ఒకే మాట..!

Divya
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆతృతంగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ నిన్నటి రోజున వెలుపడ్డాయి.. ఇందులో కేంద్రంలో బిజెపికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని చాలా సర్వేలు సైతం లెక్కేసి మరి క్లారిటీ గా తెలియజేశారు. ఎన్నికలవేళ వినిపించిన లెక్కలకు ఎగ్జిట్ పోల్ లెక్కలకు మధ్య ఉన్న వ్యత్యాసం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నది. మొత్తంగా చూసుకుంటే కేంద్రంలో మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతోందని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైన మాత్రం ఇందుకు భిన్నంగా వెలుపడ్డాయి.

కొన్ని సంస్థలు అధికార పార్టీ వైసీపీ వైపు ఉండగా మరికొన్ని కూటమివైపు గెలుపు దిమాని తెలియజేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీకి కూడా కనీసం 130 సీట్లు దాటవనే విధంగా తెలియజేస్తున్నారు. పరస్పర విరుద్ధ అంచనాలని తెలియజేశాయి ఎగ్జిట్ పోల్స్.. అయితే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్న పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారని విషయమైతే చాలా స్పష్టంగా అన్ని సర్వేలు ఎగ్జిట్ పోల్స్ కూడా తెలియజేశాయి.. 2019 ఎన్నికలలో రెండు స్థానాలలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల కూడా ఓడిపోయారు.

అయితే ఈసారి అందుకు భిన్నంగా ఘనవిజయాన్ని అందుకుంటారని అన్ని సర్వేలు ఎగ్జిట్ పోల్స్ కూడా తెలియజేస్తున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తారనే విషయాన్ని ఎంత ప్రాధాన్యత ఉందో పవన్ కళ్యాణ్ గెలుపు పైన కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక ఆసక్తికరమైన చర్చగా మారింది. ముఖ్యంగా అక్కడ సీనియర్ నేతగా ఉన్న వైసీపీ మహిళా నేత వంగా గీత కు మంచి పేరు ప్రఖ్యాతలు ఉండడంతో ఇక్కడ చాలా టఫ్ గా మారిందని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.. మరి ఇలాంటి సందర్భంలో వైసిపి నేతలు మాత్రం వంగా గీత గెలుస్తుందని ధిమాలతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి తానే గెలుస్తానని జనసేన కార్యకర్తలతో పాటు కూటమి కూడా కాన్ఫిడెంట్ తో ఉన్నది. మరి ఎవరు గెలుస్తారు నాలుగవ తేదీ తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: