హోం మంత్రి తానేటి వ‌నిత‌కు గెలుపుపై ఆశ‌లు ఎందుకు పోయాయ్‌..?

RAMAKRISHNA S.S.
- గోపాల‌పురం మండ‌లం మీదే వైసీపీ ఆశ‌లు
- న‌ల్ల‌జ‌ర్ల‌, ద్వార‌కాతిరుమ‌ల, దేవ‌ర‌ప‌ల్లిలో సైకిల్ స్వింగ్‌
- టీడీపీ ' మ‌ద్దిపాటి ' గెలుపు మీద భారీ బెట్టింగులు
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
హోం మంత్రి తానేటి వనిత ఎన్నికలలో కొవ్వూరు నుంచి గోపాలపురంకు మారినా... ఆమె ఫేట్ మాత్రం మార‌న‌ట్టే కనిపిస్తోంది. ఎన్నికలు ముగిశాక పోలింగ్ సర‌ళిని బట్టి చూస్తే గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ కుర్రనేత మద్దిపాటి వెంకట్రాజు చేతిలో వనిత ఓడిపోవడం ఖాయం అయిందా అంటే.. మెజార్టీ సర్వేలు.. గోదావరి రాజకీయ విశ్లేషణలు అవునని చెబుతున్నాయి. గోపాలపురం నియోజకవర్గంలో గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలాలు ఉన్నాయి. పోలింగ్‌కు ముందు మంత్రి వనితకు గెలుపు పై ఉన్న ధీమా.. పోలింగ్ తర్వాత బాగా స‌డ‌లి పోయినట్టు వైసీపీ వాళ్ళే చెవులు కోరుకుంటున్నారు. నల్లజర్ల మండలంలో టీడీపీకి మంచి ఆధిక్యత వస్తుందని వైసీపీ వాళ్లు.. టీడీపీ వాళ్లు ఇద్దరు చెబుతున్న మాట.

ద్వారకా తిరుమల మండలంలో మండల కేంద్రానికి దిగువపక్క గ్రామాల‌లో టీడీపీకి ముందు నుంచి మంచి పట్టు ఉంది. ద్వారకాతిరుమల పైపక్క గ్రామాలలో వైసీపీకి మెజార్టీ వస్తుందని అందరూ లెక్కలు వేసుకున్నారు. తీరా పోలింగ్ తర్వాత చూస్తే ద్వారకాతిరుమల పైపక్క గ్రామాలలో కూడా టీడీపీకి ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ మెజార్టీ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ద్వారకాతిరుమల మండలంలో కూడా పార్టీ వాళ్లు ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీ రాబోతుందని తెలుస్తోంది. ఇక వైసీపీ ముందు నుంచి గోపాలపురం, దేవరపల్లి మండలాలపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టు కనిపించింది.

గోపాలపురం మండలంలో హోరాహోరీ పోరు జరిగినా... దేవరపల్లిలో వైసీపీ అంచనాలు పూర్తిగా తప్పాయి. ఇక్కడ కూడా టీడీపీ ఆధిక్య‌త‌లోకి వచ్చేసింది. నల్లజర్ల మండలంలో అన్ని వర్గాలు కలిసి పనిచేయడంతో ఇక్కడ వైసీపీకి అస్సలు ఛాన్స్ లేకుండా పోయింది. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ టీడీపీ విజయం ఖాయంగా.. హోం మంత్రి తానేటి వనిత ఓటమి క్లారిటీగా కనిపిస్తున్నాయి. అయితే కూటమి వేవ్‌ను బట్టి టీడీపీ అభ్యర్థి వెంకట్రాజు మెజార్టీ ఎక్కడ ? వరకు వెళ్ళి ఆగుతుందో అన్నది ఒక్కటే చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: