ఇండియన్ 2 లో ఆ సీన్స్ చూసి తట్టుకోలేరు.. డైరెక్టర్ శంకర్..!?

Anilkumar
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సినిమా ఇండియన్ 2. అయితే గత కొన్ని ఏళ్లు గా ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవడంతో ఇప్పుడు ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు. లోకనాయకుడు కమలహాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో ఆయనతో పాటు మరెందరో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇండియన్ టూ ఇండియన్ 3 సినిమాలకు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాంతో ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్

 అవుతున్నాయి. అయితే ఈ సినిమా జూన్ 12న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్నారు.  ఇక ఈ కార్యక్రమంలో డైరెక్టర్  మాట్లాడుతూ.. ఇండియన్ టు సినిమాలో కమలహాసన్ కి సంబంధించిన ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని.. ఆయన అభిమానులకు ఆయన సన్నివేశాలన్నీ కూడా పండగ లాగా ఉంటాయి అని చెప్పారు. అంతేకాదు సినిమా మొత్తం లో కమలహాసన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది అని అన్నారు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో కలిసి మొదటిసారి వర్క్ చేస్తున్నాను.. ఇందులో ఆరు పాటలు ఉన్నాయి.. అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అని తెలిపాడు.

 ఇందులో కాజల్  ఉండదు అని.. కాజల్ పాత్ర కేవలం ఇండియన్ త్రీ లోనే ఉంటుంది అని బాంబు పేల్చాడు. దీంతో ఆయన చెప్పిన మాటలు విన్న కాజల్ అభిమానులు ఒకసారిగా షాక్ అయ్యారు. అంతేకాదు ఇందులో హీరోయిన్గా కేవలం రకుల్ మాత్రమే కనిపిస్తుంది అని అన్నారు. మరికొందరూ కీలక పాత్రలో కనిపించబోతున్నారు అని అన్నారు. లేకపోతే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు. ఉన్నాయి. మరి విడుదలైన తర్వాత ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాతో పాటు గేమ్ చేంజర్ సినిమా సైతం చేస్తున్నాడు దర్శకుడు శంకర్. మరి ఈ సినిమా విడుదల చేస్తున్నాడు కానీ.. గేమ్ చేంజర్ సినిమా విడుదల కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: