తెలుగులో జూనియర్లకి షాక్ ఇస్తున్న అంజలి..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు అమ్మాయి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె మొదట తెలుగు సినిమాల్లో నటించిన ఆమెకు వాటి ద్వారా పెద్దగా గుర్తింపు దక్కలేదు. జర్నీ అనే తమిళ సినిమా ద్వారా ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడం వల్ల అంజలి కి తెలుగు లో కూడా మంచి క్రేజ్ లభించింది. ఈ సినిమా తర్వాత ఈమెకు వెంకటేష్ , మహేష్ బాబు హీరోలుగా రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో అవకాశం దక్కింది.

ఇందులో ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో వరుసగా బాలకృష్ణ , వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో అంజలి కి అవకాశాలు దక్కాయి. అలాగే కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా అంజలి నటించింది. ఇక ఈ బ్యూటీ కేవలం సినిమాలలో తన నటనతో మాత్రమే కాకుండా వీలు చుక్కినప్పుడల్లా తన అందాలను కూడా ఆరబోస్తూ జనాల్లో మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే గత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని రోజుల క్రితమే గీతాంజలి మళ్లీ వచ్చింది అనే మూవీ తో ఈ బ్యూటీ ప్రేక్షకులను పలకరించింది.

ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈమె నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ లో ఈమె ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈమె నటించిన గేమ్ చెంజర్ సినిమా కూడా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలా ఈమె వరుస క్రేజీ మూవీలతో జూనియర్ హీరోయిన్లకు షాక్ ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: