"ఇండియన్ 2" విడుదల ముందు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన శంకర్..!

MADDIBOINA AJAY KUMAR
ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో శంకర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి దేశంలోనే సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం శంకర్ , కమల్ హాసన్ హీరోగా ఇండియన్ అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో భారతీయుడు అనే టైటిల్ తో విడుదల చేశారు. ఈ మూవీ తమిళ్ , తెలుగు రెండు ఇండస్ట్రీ లలో కూడా బ్లాక్ బాస్టర్ విజయం సాధించి కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది.

ఈ సినిమాకు సీక్వల్ గా చాలా సంవత్సరాల తర్వాత శంకర్ , కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ , కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని తెలుగులో భారతీయుడు 2 అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఈ సినిమాని తమిళ్ , తెలుగు భాషలతో పాటు హిందీ లో కూడా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాతో పాటు శంకర్ ఇండియన్ 3 మూవీ ని కూడా తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఇండియన్ 3 కి సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణను కూడా పూర్తి అయింది.

ఇదిలా ఉంటే తాజాగా ఇండియన్ 2 మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా విడుదలకు ముందే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఆ ట్విస్ట్ ఏమిటి అంటే ... ఇండియన్ 2 మూవీ లో కాజల్ అగర్వాల్ ఉండదు. ఆ పాత్ర ఇండియన్ 3 లో ఉంటుంది అని పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఎన్ని రోజుల పాటు కాజల్ అగర్వాల్ ఇండియన్ 2 లో ఉంటుంది అని అంతా భావించారు. లేదు అని తెలియడంతో ఈమె అభిమానులు తీవ్ర నిరుత్సాహ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: