జగన్: డిక్లరేషన్ వివాదం పైన.. హైకోర్టు ఏం చెప్పిందంటే..?
చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని సైతం ప్రక్షాళన చేసుకోవడం కోసమే రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజున పలు ఆలయాలలో పూజలు చేయాలి అంటూ జగన్ కూడా క్యాడర్ కు సూచించారు. దీంతో ఆయన కూడా స్వయంగా తిరుపతికి వెళ్లాలని నిన్నటి రోజున సాయంత్రం బయలుదేరారు.. అయితే కొన్ని కారణాల చేత ఈ విషయాన్ని కూడా టీటీడి , కూటమి నేతలు డిక్లరేషన్ ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నారు.
దీంతో ఈ విషయం పైన పెద్ద ఎత్తున ఒక రాజకీయ చర్చే జరుగుతోంది. కూటమి నేతలందరూ కూడా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి అంటూ పట్టు పడుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ హైకోర్టు సంబంధించి ఒక పాత తీర్పు వైరల్ గా మారుతోంది.. 2020లో ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించడానికి వెళ్లిన జగన్ తిరుమలలో ఎలాంటి డిక్లరేషన్ సంతకం చేయలేదని.. ఆయన నియంత్రించాలనే దాఖల పైన కూడా హైకోర్టు కొట్టి వేసింది. కేవలం వైసీపీ అధినేత జగన్ క్రైస్తవుడని టీటీడీ నిబంధనల ప్రకారం ఎవరు కూడా ఇతర మతస్తులు తిరుమలకు వెళ్లిన డిక్లరేషన్ సంతకం ఉండాల్సిందే అన్నట్లుగా అప్పట్లో గుంటూరుకు చెందిన సుదీర్ బాబు పిటిషన్ వేశారు.. అయితే జగన్ అన్య మతస్థుడని ఎక్కడ సాక్ష్యధారాలు లేకపోవడం వల్ల హైకోర్టు కొట్టేసింది. అప్పట్లో టీటిడి ఆహ్వానించడం వల్లే ఆయన తిరుపతికి వెళ్లారని రాష్ట్ర ప్రజల తరపు నుంచి కూడా పట్టు వస్త్రాలను కూడా సమర్పించారు. దీంతో అప్పట్లో కూడా కోర్టు జగన్ ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదంటూ తేల్చి చెప్పింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.