బాలయ్య మూవీకి విలన్ దొరికేశాడు... పవర్ఫుల్ పాత్రలో పవర్ఫుల్ నటుడు..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నటసింహం బాలకృష్ణ కొంతకాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో నటించి రెండింటిలోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సూపర్ సక్సెస్ కావడంతో ఆ తర్వాత కొంతకాలానికి ఈ మూవీ కి సీక్వెల్ ఉండబోతుంది అని ఈ సినిమా దర్శకుడు , హీరో ఇద్దరు కూడా తెలియజేశారు.

కొన్ని రోజుల క్రితం ఈ సినిమా దర్శకుడు అయినటువంటి బోయపాటి శ్రీను ఇప్పటికే అఖండ 2 కి సంబంధించిన కథ మొత్తం పూర్తి అయింది అని , ప్రస్తుతం బాలకృష్ణ రాజకీయ పనులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన రాజకీయ పనులను ముగించుకున్న తర్వాత అఖండ 2 సినిమాను మొదలు పెడతాం అని ప్రకటించాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసాయి. రేపు ఫలితాలు రానున్నాయి. ఇక మరికొన్ని రోజుల్లోనే బాలకృష్ణ ఫ్రీ కానున్నాడు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఆఖండ 2 సినిమాను మొదలు పెట్టే అవకాశం వున్నారు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే అఖండ 2 స్క్రిప్ట్ మొత్తాన్ని రెడీ చేసిన బోయపాటి ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్ పాత్ర ఉన్నట్లు అందుకోసం సంజయ్ దత్ , బాబి డియోల్ లాంటి నటులను అనుకుంటున్నట్లు ఓ వార్త గత కొన్ని రోజులు అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆఖరుగా సంజయ్ దత్ ను ఈ మూవీ లో విలన్ పాత్రలో మేకర్స్ ఫైనల్ చేసినట్లు , అందులో భాగంగా బాలకృష్ణ , సంజయ్ దత్ కి ఫోన్ చేసి ఆ పాత్ర గురించి చెప్పినట్లు , ఆయన కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: