కల్కిలో దేవర.. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..!

lakhmi saranya
నేడు అనగా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ నటించిన కల్కి సినిమా భారీ థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో ప్రతి చోటా నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానుల హడావిడి మామూలుగా లేదు. ఇక కల్కి చిత్రంలో అనేక సినిమా ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్ అండ్ హీరోయిన్ దీపికా పదుకొనే, దిశా పటాని, సల్మాన్ ఖాన్ నటించారు. ఇక ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాల్లో కల్కి మొదటి షోలు పూర్తయ్యాయి.
ఇక మొదటి షో చూసిన ప్రతి ఒక్కరూ సినీ ప్రేమికుడు సినిమా గురించి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్ సీన్లు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయంటూ ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఇక మూవీ మొదలయ్యే ముందు హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న దేవరా సినిమా టీజర్ను వేయడంతో అభిమానులు మరింతగా ఎంజాయ్ చేశారు. ప్రజెంట్ ఎందుకు సంబంధించిన ఫోటోలు అండ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓకే థియేటర్లలో ఇద్దరి హీరోలని చూడబోతున్నాం అనే ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న దేవరా సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని థియేటర్లలో ఈ టీజర్ ని సినిమా స్టార్టింగ్ ముందు వేస్తున్నారు. ఇక త్రిబుల్ ఆర్ వంటి సక్సెస్ అనంతరం ఎన్టీఆర్ చేసిన సినిమా కావడంతో ఈ మూవీ టీజర్ కి కూడా వేరే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. ఇక ఒకపక్క పాణి ఇండియా స్టార్ ప్రభాస్ మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ పై కనిపించడంతో ప్రేక్షకుల ఆనందాలు అంబరాన్ని అంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: