మెగా వారసురాలికి ప్రభాస్ బుజ్జి గిఫ్ట్.. షాక్ లో ఉపాసన..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. ఈ సినిమా విడుదల కావడానికి కొద్దిరోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు, మేకర్స్. ఇప్పటికే ప్రభాస్ నడిపిన కారు బుజ్జి ను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ ఈవెంట్ సైతం నిర్వహించారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రముఖ నగరాల్లో ఈ బుజ్జి ని చూపిస్తున్నారు.

 అయితే తాజాగా ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా కల్కి టీం సినీ సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్ గా బుజ్జి ని పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కూతురుకి చిత్రబంధం ఊహించని గిఫ్ట్ పంపింది. అయితే అందులో బుజ్జి భైరవ స్టిక్కర్స్ తో పాటు బుజ్జి బొమ్మ టీషర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ సందర్భంగా ఉపాసన వాటికి సంబంధించిన ఫోటోలను తన కూతురు బుజ్జి తో ఆడుతున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. కల్కి టీం కి థాంక్స్ ఆల్ ద బెస్ట్ అంటూ తెలియజేసింది

 మెగా కోడలు ఉపాసన. దీనితో ప్రస్తుతం బుజ్జి భైరవ స్టిక్కర్స్ మరియు బుజ్జి కార్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అంతేకాదు ప్రమోషన్స్ లో భాగంగానే బుజ్జి అండ్ భైరవ పేరుతో యానిమేటెడ్ సిరీస్ సైతం విడుదల చేశారు బృందం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సైంటిఫిక్ యాక్షన్ త్రిల్లర్ నేపథ్యంలో రాబోతోంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో దిశా పటాలను సైతం ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నట్లుగా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: