నాగార్జున, ధనుష్ ల మధ్య నెక్స్ట్ లెవెల్ సీన్స్ ప్లాన్ చేస్తున్న శేఖర్ కమ్ముల..!?

Anilkumar
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన దర్శకత్వంలో సినిమా వచ్చింది అంటే చాలు కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే సినిమాల మీద ఆయనకి ఉన్న ఇంట్రెస్ట్ అలాంటిది. తన ఇష్టాలని సినిమాలుగా తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు శేఖర్ కమ్ముల. అంతేకాదు ఈయన దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఎంతో ఆసక్తిగా సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే శేఖర్ కమ్ముల తన

 రీతిలో అద్భుతాలను సృష్టిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయన చేస్తున్న సినిమా కుబేర. తమిళ స్టార్ హీరో ధనుష్  హీరోగా వస్తున్న ఈ సినిమాలో నాగార్జున సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీ లో ఒక భారీ సెట్ ను ఏర్పాటు చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అంతేకాదు ఇందులో నాగార్జున ధనుష్ ల మధ్య జరిగే కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నట్లుగా సమాచారం. అయితే

 ఇందులో నటిస్తున్న ఇద్దరు హీరోలు కూడా పెద్ద స్టార్స్ అందుకే ఎవరి పాత్ర డౌన్ కాకుండా చాలా బ్యాలెన్స్ గా ఇద్దరి పాత్రలను నడిపిస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఒకవేళ అటూ ఇటూ ఇద్దరిలో ఏ ఒక్క హీరో క్యారెక్టర్ కాస్త తగ్గినా కూడా వాళ్ళ అభిమానులు అస్సలు ఊరుకోరు. ఆ విషయం ని దృష్టిలో పెట్టుకొని శేఖర్ కమ్ముల వాళ్ళ క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక నాగార్జున విషయానికి వస్తే.. ప్రస్తుతం గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ తో  అవుతున్న నాగార్జున ఈ సినిమాతో అయినా హిట్టు కొడతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. శేఖర్  సైతం ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ కొడితే బాగుంటుంది అని వైట్ చేస్తున్నారు అభిమానులు. మరి వీళ్ళిద్దరూ ఈ సినిమాతో హిట్టు కొడతారా లేదా అన్నది తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: