స్కిన్ ఎలర్జీ తో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్..!!

murali krishna
తన అందచందాలతో  సోషల్ మీడియా ను ఒక ఊపూ ఊ పూతున్న ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. వెండితెరపై తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటారు చాలా మంది నటీనటులు. ఒక్క హిట్ అయితే ఆ యాక్టర్స్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోతుంది.ఊహించని ఫాలోయింగ్, స్టార్ డమ్ అందుకుంటారు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. నటీనటులుగా తమకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్న తారలు.. పర్సనల్ లైఫ్ లో మాత్రం నిత్యం ఏదోక సమస్యతో పోరాడుతూనే ఉంటారు. ఇటీవల కొందరు సెలబ్రెటీస్ తాము ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల గురించి బహిరంగంగా చెప్పేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతుంది హీరోయిన్ సమంత. అలాగే ఇటీవల పుష్ప 2 నటుడు ఫహద్ ఫాజిల్ సైతం తాను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్య గురించి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మరో తార తనకున్న హెల్త్ ఇష్యూ గురించి చెబుతూ తన ఫేస్ ఫోటోస్ షేర్ చేసింది. పైన ఫోటోను చూశారా.. ముఖం, కళ్లు, పెదవులు పూర్తిగా ఉబ్బిపోయి.. చర్మం కందిపోయి కనిపిస్తున్న ఆ తార.. సోషల్ మీడియా సెన్సెషన్. తనే ఇంటర్నెట్ సంచలనం ఉర్ఫీ జావేద్.
సోషల్ మీడియాలో తనదైన ఫ్యాషన్ స్టైలీష్ దుస్తులతో నిత్యం అందరినీ దృష్టిని ఆకర్షిస్తుంది. ఎప్పుడు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ధరించి నెట్టింట సంచలనంగా మారే ఉర్ఫీ ఇప్పుడు తన అనారోగ్య సమస్యను చెప్పుకొచ్చింది. బొటాక్స్, ఫిల్లర్స్ గురించి తెలిపింది. 18 ఏళ్ల వయసు నుంచి తాను ఫిల్లర్లు పొందుతున్నానని.. తీవ్రమైన అలెర్జీల కారణంగా తన ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని అన్నారు. ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఇమ్యునోథెరపీ తీసుకుంటున్నట్లు వెల్లడించింది.చర్మ అలెర్జీల కారణంగా తాను ఎంతో బాధపడుతున్నట్లు తెలిపింది. అలెర్జీ వల్ల తన ముఖం చాలాసార్లు ఉబ్బిపోతుందని.. నిద్రలేచేసరికి తన ముఖం వాచి పోతుందని.. దీనివల్ల ఎప్పుడూ అసౌకర్యంగా ఉంటానని అన్నాడు. ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఇమ్యునోథెరపీ జరుగుతుందని.. 18 ఏళ్ల వయసు నుంచి సాధారణ ఫిల్లర్లు, బొటాక్స్ కారణంగా తనకు ఎలాంటి సమస్య రాలేదని తెలిపింది. తన ముఖం వాచినట్లు కనిపిస్తే ఎలాంటి సలహాలు ఇవ్వద్దని తెలిపింది. ప్రస్తుతం ఉర్ఫీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. ఉర్ఫీ ఫోటోస్ చూసి ఆందోళన చెందుతున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: