పొన్నూరు : ఆ పార్టీ సైడ్ జనాలు నిలవనున్నారా..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గం ఒకటి. మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పొన్నూరు నియోజకవర్గాన్ని అధికార పక్షం అయినటువంటి వైసీపీ మరియు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కూటమి ఎంతో కీలకంగా తీసుకున్నాయి. దానితో ఎన్నో ఆలోచనల తర్వాత కూటమి ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేసింది. 2019 వ సంవత్సరం ఈ ప్రాంతం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా కిలారి వెంకట రోశయ్య పోటీ చేయగా , టీడీపీ పార్టీ అభ్యర్థిగా narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పోటీ చేశారు.

ఇక జనసేన పార్టీ అభ్యర్థిగా బోని పార్వతి పోటీ చేశారు. బోనీ పార్వతి పోటీలోకి దిగింది. కానీ పార్వతి ఏమాత్రం ప్రభావం చూపలేక కేవలం 12033 ఓట్లను మాత్రమే తెచ్చుకోగలిగింది. ఇక వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెంకట రోశయ్య , టీడీపీ పార్టీ అభ్యర్థి నరేంద్ర కుమార్ మధ్య భారీ పోటీ నెలకొంది. ఈ పోటీలో స్వల్ప ఓట్ల మెజారిటీతో వెంకట రోశయ్య గెలిచారు. ఇక 2019 లో జరిగిన ఎలక్షన్లలో ఉత్కంఠ పోరులో గెలిచిన వెంకట రోశయ్య ఈసారి కూడా తనకే ఈ ప్రాంత టికెట్ దక్కుతుంది అని ఆశించారు.

కాకపోతే ఈయనకు ఈ ప్రాంతంలో గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనే నేపథ్యంలో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ సారి ఇక్కడి టికెట్ ను అంబటి మురళీ కృష్ణ కు ఇచ్చారు. కూటమిలో భాగంగా ఈ సీటును పోయినసారి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దక్కించుకున్నారు. ఈ ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జక్కా రవీంద్రనాథ్ ఉన్నారు. ప్రస్తుత సమీకరణాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవీంద్రనాథ్ పెద్దగా ప్రభావాన్ని చూపే అవకాశాలు లేవు అని తెలుస్తుంది.

అంబటి మురళీ కృష్ణ , నరేంద్ర కుమార్ మధ్య భారీ పోరే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అందులో కూడా పోయినసారి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం, ఆ తర్వాత కూడా ఇదే ప్రాంత ప్రజలతో కలిసి ఉండటంతో నరేంద్ర కుమార్ కి అంశం కలిసి వచ్చి ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చాలా మంది ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: