సొంతోళ్లే కేసిఆర్ కు వెన్నుపోటు.. ఇక ఒక్క గెలుపు కూడా కష్టమే?

praveen
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారం చేపట్టి తిరుగులేని పార్టీగా ఎరిగిన బిఆర్ఎస్ పార్టీకి ఒకసారి ప్రతిపక్షంలోకి రాగానే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందో రాలేదో చివరికి గులాబీ పార్టీలోని కీలక నేతలందరూ కూడా పార్టీని వీడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ గూటికి చేరుకున్నారూ. ఇలా సిట్టింగులుగా ఉన్నవారు ఎంతో మంది పార్టీని వీడారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో మిగతా నేతలు కూడా కారు పార్టీని వీడే అవకాశం ఉంది అని అందరూ అంచనా వేశారు రాజకీయ నిపుణులు.

 ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటడం అటు గులాబీ పార్టీకి తప్పనిసరిగా మారింది. అయితే కేసీఆర్ బరిలోకి దిగి ఇక  తమ పార్టీ అభ్యర్థులు అందరినీ గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ.. ఇక ఫలితం లేకుండా పోయిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది.  ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో టిఆర్ఎస్ పార్టీ ఒక్క విజయం కూడా లేదు అని చెప్పాయి. అయితే చెప్పినట్లుగానే ఇప్పుడు కౌంటింగ్ లో కూడా ఇదే జరుగుతుంది అన్నది తెలుస్తుంది.

 అయితే బిఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానంలో విజయం సాధిస్తుంది అని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్పాయి. అయితే ఆ ఒక్క స్థానం ఏది అని అందరూ చర్చించుకుంటూ ఉండగా.. కేసీఆర్ సొంత జిల్లా ఆయన మెదక్ లోనే ఇక కారు పార్టీ గెలవబోతుందని కొందరు అంచనా వేశారు. కానీ ప్రస్తుతం కౌంటింగ్ ఫలితాలు చూసుకుంటుంటే అది కూడా జరిగేలా లేదు. ఏకంగా కేసీఆర్ను సొంత జిల్లా ప్రజలు వెన్నుపోటు పొడిచారు. గులాబీ దళపతిని సొంతోళ్లే నమ్మలేదు. ఎందుకంటే ప్రస్తుతం కౌంటింగ్ ఫలితాలలో బిఆర్ఎస్ పార్టీ కంచుకోట అయిన మెదక్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు 3888 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. దీంతో కనీసం మెదక్లో అయిన ఒక్క సీటు గెలుస్తుంది అనుకున్న బిఆర్ఎస్ కు ఆ సీటు కూడా దక్కేలా కనిపించట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: