నాగార్జున గోవింద గోవింద మూవీ వెనుక అంత కథ నడిచిందా.. ఆర్జీవి గట్టిగానే పెట్టాడుగా..!

Amruth kumar
వివాదాస్పద దర్శకుడు  రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు . ఆయన నుంచి వచ్చిన సినిమాల కు గతం లో ఎవరు ఊహించని రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది . వరుస విజయాలు అందుకున్న రామ్ గోపాల్ వర్మ ఎవరు ఊహించని సినిమాలు తీసి అతి తక్కువ టైం లోనే స్టార్ట్ డైరెక్టర్ గా మారాడు . దర్శకుడు గా శివ సినిమా ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది .. ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించాడు. ఈ సినిమా తోనే నాగార్జున ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు .

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతో ..   తర్వాత నాగార్జున తోనే ఆయన మరో సినిమా చేశారు ... ఆ సినిమానే గోవింద గోవింద .. ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మతో కలిసి కొమ్మనపల్లి అనే రచయిత కథ ను అందించారు . ఈ సినిమా లో ఒక్కో సమావేశం కోసం ఆర్జీవి ఎంతో కష్టపడ్డారు. పర్ఫెక్షన్ కోసం ఆర్టిస్టులను కూడా బాగానే కష్టపెట్టారు.  అయితే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. వెంకటేశ్వర స్వామి గుడి కాన్సెప్ట్ మీద ఈ సినిమా నడుస్తుంది .. అందుకే ఈ సినిమాకు తొలత వెంకటేశ్వర మహత్యం అనే పేరు పెట్టాలని అనుకున్నారు.

అయితే .. వర్మకి ఆ టైటిల్ నచ్చకపోవడం తో మరో టైటిల్ డిఫరెంట్ గా ఉండేలా పెట్టాలని అనుకున్నారట. ఎన్ని రోజులు ఆలోచించిన సరైన టైటిల్ తట్టలేదట. ఓ రోజు ఆర్జీవీ వచ్చి కొమ్మనపల్లి తో గోవిందా గోవిందా అనే టైటిల్ ని పెడదామని అన్నారట . కానీ, ఎవరైనా చనిపోయిన వారిని తీసుకెళ్లేటప్పుడు అలా అంటారని .. మన దేవుడి సినిమాకి అది పెట్టడం కరెక్ట్ కాదేమోనని అన్నారట . అయితే .. కచ్చితంగా అదే పెట్టాలి అని రామ్ గోపాల్ వర్మ కావాలనే ఆ టైటిల్ పెట్టించారట ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: