టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ అద్భుతమైన నటనతో, డాన్స్ పెర్ఫార్మెన్స్ తో భారీ పాపులారిటీ అందుకున్నారు.ముఖ్యంగా ఎన్టీఆర్ కి దేశవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ ను అభిమానించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఒక అభిమాని తల్లి ఎన్టీఆర్ పై చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పాడు అంటూ ఎన్టీఆర్ అభిమాని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కష్టం వచ్చిన అభిమానికి అండగా నిలిచే ఎన్టీఆర్ మాట తప్పడం ఏంటి? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఇటీవల దేవర సినిమా రిలీజ్ కు ముందు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన కౌశిక్ అనే బాలుడు క్యాన్సర్తో బాధపడుతూ తాను చనిపోయేలోపు దేవర సినిమా చూడాలని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.దాంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, బాలుడిని ఎన్టీఆర్తో వీడియో కాల్ ద్వారా కలిపించారు.దాంతో ఎన్టీఆర్ తన అభిమానితో వీడియో కాల్ మాట్లాడారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ కి ధైర్యం చెప్పి, బాలుడికి కావాల్సిన వైద్య ఖర్చులన్నింటిని భరిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ రోజు ఎన్టీఆర్ చెప్పినట్లు తమకు ఎలాంటి సాయం చేయలేదని బాలుడి తల్లి తాజాగా మీడియా వేదికగా చెప్పారు.ఇదిలావుండగా ప్రభుత్వం ద్వారా 11 లక్షలు, టీటీడీ ద్వారా 40 లక్షల ఆర్థిక సహాయం అందింది.ఆ డబ్బుతోనే బాబుకు ట్రీట్మెంట్ చేయించాం.
ప్రస్తుతం మా బాబు చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆసుపత్రి వాళ్ళు ఇంకా 20 లక్షలు కట్టాలని అడుగుతున్నారు. అంటూ ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఇప్పటికైనా ఎన్టీఆర్ తన అభిమానికి సాయం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.