ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అల్లు అర్జున్ పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పుష్ప 2 సినిమాలో పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్‌లో ఉండగా హీరో ఉచ్చ పోశాడని.. కొన్ని సీన్స్ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. హీరో అల్లు అర్జున్ తో పాటు డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలపై కూడా చర్యలు తీసుకోవాలని మల్లన్న పోలీసులను కోరారు.
ఇక పోతే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీ తేజ్ కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని డాక్టర్స్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రి ICU లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆ బాలుడి ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నాడని హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు.
ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఆయనను కలవడానికి చాలా మంది వచ్చి వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. జరిగిన ఘటనలో అల్లు అర్జున్ కి కన్ను పోలేదు.. కాలు పోలేదు ఎలాంటి గాయం కాలేదని, ఎందుకు అందరూ వెళ్లి పరామర్శించడం అని ఫైర్ అయ్యారు. శ్రీ తేజ్ కన్న తల్లిని పోగొట్టుకున్నాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఒక్కరైనా సహాయం చేశారా.. పోనీ వెళ్లి చూశారా అంటూ మండిపడ్డారు. దీంతో జనాలు ఎక్కువగా రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేస్తున్నారు.