అరకు పార్లమెంట్ లో జోరుగా ఫ్యాన్ గాలి..?

Pulgam Srinivas
మే 13 వ తేదీన జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. దానితో ఈ రోజు ఉదయం నుండే ఎన్నికల సంఘం చాలా పకడ్బందీగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే దాదాపు రాష్ట్రంలోని అనేక చోట్ల ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. అందులో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా పూర్తి అయింది. కొంత లేట్ అయిన ఇప్పటికే చాలా స్థానాలకు సంబంధించిన మొదటి రౌండ్ ఫలితాలు కూడా విడుదల అయ్యాయి.

అందులో భాగంగా ప్రస్తుతం అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే కూటమి జోష్ లో ముందుకు సాగుతుంది. ఇప్పటికే వంద స్థానాలకు పైగా ఆదిత్యం లో కూటమి కొనసాగుతుంది. ఇలానే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయం. ఇకపోతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్లమెంటు స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా మొదలు అయింది. అందులో భాగంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఒకటి , రెండు రౌండ్ల ఫలితాలు కూడా వెలుపడ్డాయి.

ఇకపోతే తాజాగా అరుకు పార్లమెంట్ స్థానానికి సంబంధించిన తొలి రౌండు ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇక ఇక్కడ వైసిపి పార్టీ అభ్యర్థిగా తనుజ రాణి బరిలో ఉండగా , కూటమి అభ్యర్థిగా గీత బరిలో ఉంది. ఇక వీరిలో మొదటి రౌండ్ ముగిసే సరికి వైసిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి తనుజరానికి 3823 ఓట్లు రాగా , కూటమి అభ్యర్థి అయినటువంటి గీత కు 2566 ఓట్లు వచ్చాయి. దీనితో మొదటి రౌండ్ ముగిసే సరికి వైసిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి తనుజరాని కి 1357 ఓట్ల లీడ్ వచ్చింది. మరి ఈ లీడ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: