విశాఖ: బాలయ్య అల్లుడు వైసీపీని బ్లాస్ట్ చేసేలా ఉన్నాడే?

Purushottham Vinay
ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపిన పార్లమెంటు నియోజకవర్గాల్లో విశాఖపట్నం లోక్ సభ సీటు కూడా ఒకటి. ఎందుకంటే ఇక్కడ వైసీపీ మూడు రాజధానుల ప్రకటన తర్వాత మారిన పరిస్ధితులు, వైసీపీపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు, శాంతిభద్రతలు, సంక్షేమం, కుల సమీకరణాలు ఇలా చాలా అంశాలు ఈసారి విశాఖ తీర్పులో ఎంతో కీలకంగా మారాయి.విశాఖ పార్లమెంట్ సీటులో గత ఎన్నికలకూ, ఈసారి ఎన్నికలకూ రాజకీయాలు ఎంతో వేగంగా మారిపోయాయి. 2019లో జగన్ ఫ్యాన్ గాలిలో చాలా సులభంగా విశాఖ ఎంపీ సీటును కైవసం చేసుకున్న వైసీపీ, ఆ తర్వాత మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను అసలు రాజధానిగా చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఇక్కడ ఆ పార్టీకి పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చాయి. అయితే దీన్ని కొనసాగించడంలో వైసీపీ విఫలమైందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా భూకబ్జాలతో వైసీపీ నేతలు చేసిన హంగామా స్థానికుల్లో అనేక రకాల విమర్శలకు కారణమైంది. అయితే ఇప్పటికీ నగరంలోని విశాఖ నార్త్, సౌత్ అసెంబ్లీ సీట్లలో ఆ పార్టీకి పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది.వైసీపీ తరఫున విశాఖ నుంచి పోటీ చేసేందుకు స్ట్రాంగ్ అభ్యర్ధులెవరూ దొరక్కపోవడంతో విజయనగరానికి చెందిన మంత్రి బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మిని తీసుకురావడం జరిగింది.

ఆమె మహిళా అభ్యర్ధి కావడం, విద్యావంతురాలు కావడం, వైసీపీ సంక్షేమ పథకాల బలం వంటివి ఆమెను గెలిపిస్తాయని వైసీపీ ఎన్నో ఆశలే పెట్టుకుంది. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా అడ్డుకోలేకపోవడం, నగరంలో స్థానికంగా కీలక నేతలు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలోకి వెళ్లిపోవడం వంటి పరిణామాలు ఝాన్సీకి పెద్ద మైనస్ గా మారాయి.ఇంకా అదే సమయంలో పూర్తిగా అర్బన్ పరిధిలో ఉన్న విశాఖ లోక్ సభ ఓటు బ్యాంక్ టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన కూటమికి బాగా కలిసి వస్తోంది.ఇంకా అలాగే నగరంలో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కూడా అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుండటం, గతంలో వైసీపీ వేవ్ లో కూడా నగరంలో టీడీపీ సత్తా చాటుకున్న చరిత్ర కూటమికి ప్లస్ కానున్నాయి. ఇంకా అలాగే గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి టీడీపీ అభ్యర్ధి మతుకుమిల్లి భరత్ కు బాగా కలిసి వస్తున్నాయి.గీతం మూర్తి మనవడు, బాలకృష్ణ చిన్న అల్లుడైన భరత్ యువకుడు, విద్యావంతుడు కావడం, క్లీన్ ఇమేజ్ ఈసారి ఆయన గెలుపుకు బాటలు వేస్తాయనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భరత్  వైసీపీని బ్లాస్ట్ చేసి గెలిచే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: