ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా చాలా కీలకమైన నియోజకవర్గం. ఈసారి అక్కడ టిడిపి కూటమి మరియు వైసీపీ మధ్య హోరాహోరి పోరు జరిగింది అని చెప్పవచ్చు. అలాంటి గుంటూరు జిల్లాలో టిడిపి కూటమి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. అలాగే వైసిపి నుంచి కిలారు రోశయ్య బరిలో ఉన్నారు. ఇద్దరిలో ఎవరికి పట్టం కట్టారు అనేది ఇప్పుడు చూద్దాం.. ఎన్నారై అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లాకు కొన్ని నెలల కింద ఎంట్రీ ఇచ్చి ఎన్నో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలను తన వైపు తిప్పుకున్నారని చెప్పవచ్చు.
అలాంటి ఈ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పెమ్మసాని చంద్ర శేఖర్ తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. అంతేకాదు ఆయన మీద వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే పోటీ చేయాలని కూడా సవాల్ విసిరారు. అలాగే ఆయన 1,50,000 పైగా మెజారిటీ తగ్గితే దేనికైనా రెడీ అని సవాలు విసిరారని చెప్పవచ్చు. అలాంటి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుతం కిలారు రోశయ్యను కనీసం దరిదాపుల్లో కూడా రానివ్వడం లేదని చెప్పవచ్చు. మొదటి రౌండ్లు పూర్తయ్యే వరకు ఆయన 25 వేల 384 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఈ పద్ధతి చూస్తే మాత్రం పెమ్మసాని గెలుపుని ఎవరు ఆపలేరు అనిపిస్తోంది.
కిలారు రోశయ్య విషయానికి వస్తే.. ఈయనకు అసలు ఎంపీగా పోటీ చేయడమే ఇష్టం లేదు. ఈ సమయంలో అభ్యర్థిని మారుద్దామనుకున్నటువంటి వైసిపి మార్చలేక పోయింది. ఇది పెమ్మసాని చంద్రశేఖర్ కు మరో కలిసి వచ్చే అంశం. తప్పనిసరిగా గుంటూరు పార్లమెంట్లో జెండా ఎగరవేసేది పెమ్మసాని చంద్రశేఖర్ అని అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఏపీలో ఏ పార్లమెంట్ అభ్యర్థికి కూడా లేనటువంటి లీడింగ్ చంద్రశేఖర్ కు కొనసాగుతోంది. చివరి వరకు ఇలాగే కొనసాగితే మాత్రం ఆయన దాదాపు 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశం కూడా కనిపిస్తోంది. చూడాలి మిగతా రౌండ్లలో కూడా ఈయన దూసుకెళ్తారా లేదంటే కిలారు రోశయ్య ముందుకు వస్తారా అనేది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.