ఎన్ని విజయాలను వరుసగా అందుకున్న దర్శకులకైనా సరే వరుస పెట్టి రెండు , మూడు భారీ ఫ్లాప్ లు వచ్చినట్లయితే వారి కెరియర్ గ్రాఫ్ దారుణంగా పడిపోతూ ఉంటుంది. ఇకపోతే ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఓ దర్శకుడు కెరియర్ గ్రాప్ కూడా అలానే పడిపోయింది. ఇంతకు ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్. ఈయన కెరియర్ ప్రారంభంలో అద్భుతమైన విజయాలను అందుకుంటూ వచ్చాడు. ఈయన దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సినిమాలు ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో ఈయనకి ఇండియాలోనే దర్శకుడుగా గొప్ప గుర్తింపు వచ్చింది. అలా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఈయన కెరియర్ గ్రాఫ్ ఈ మధ్య కాలంలో దారుణంగా పడిపోయింది. ఆఖరుగా ఈయనకు రోబో సినిమాతో అద్భుతమైన విజయం దక్కింది.
ఈ సినిమా తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన స్నేహితుడు , ఐ , రోబో 2.0 సినిమాలు పెద్ద స్థాయి విజయాలను అందుకోకపోయినా పర్వాలేదు అనే స్థాయి విజయాలను అందుకున్నాయి. ఇక ఈయన ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా ఇండియన్ 2 అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కొంత కాలం క్రితం విడుదల అయ్యి భారీ ప్లాప్ ను సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమా షూటింగ్ చాలా సార్లు వాయిదా పడి మళ్లీ ప్రారంభం కావడం , అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ సినిమా చుట్టూ నెలకొనడంతో ఈ మూవీ ఫ్లాప్ అయింది అని శంకర్ తప్పు ఈ సినిమా ప్లాప్ కావడంలో ఏ మాత్రం లేదు అని కొంత మంది అభిప్రాయ పడ్డారు. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చెంజర్ సినిమా విడుదల అయింది. ఇందులో రామ్ చరణ్ హీరోగా నటించాడు. ఈ సినిమా భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా భారీ ఫ్లాప్ కావడంతో శంకర్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇక గేమ్ చేంజర్ సినిమాతో ఈయన కెరియర్ గ్రాఫ్ కూడా భారీగా పడిపోయింది.