సెంచ‌రీ కొట్టేసిన కూట‌మి... ఏపీలో మంత్రులంద‌రూ యెన‌కే యెన‌క‌..!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మెజార్టీ సర్వేలు, అంచనాలు, నివేదికలు చెప్పినట్టు కూటమి అభ్యర్థులు అన్ని ప్రాంతాల్లోనూ దూసుకుపోతున్నారు. మంత్రులు ఆర్‌కే రోజా నగరి నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసిన గాలి ముద్దుకృష్ణమనాయుడు చేతిలో వెనకబడిపోయారు. అలాగే మంత్రులు గుడివాడ అమర్నాథ్, కొడాలి నాని, అంబటి రాంబాబు, విడుదల రజిని, ధర్మాన ప్రసాదరావు వీరంతా వెనకబడిపోయారు. అలాగే చీపురుపల్లిలో మంత్రి బొత్స‌ సత్యనారాయణ కూడా వెనకంచిలో ఉన్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు కూడా వెనకంజ‌లో ఉన్నారు. విచిత్రం ఏమిటంటే తునిలో దాడిశెట్టి రాజా కూడా వెనకంజ‌లో ఉన్నారు.

ఇక గుడివాడ‌లో టీడీపీ నుంచి పోటీ చేసిన వెనిగండ్ల రాము ఏకంగా 14 వేల ఓట్ల ఆధిక్యంలో కొడాలి నానిపై దూసుకు పోతుండ‌డం మామూలు విష‌యం కాద‌ని చెప్పాలి. ఇక గ‌న్న‌వ‌రంలో కూడా యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు విజ‌యం సాధించే దిశ‌గా దూసుకు పోతున్నారు. ఇక పెన‌మ‌లూరులో కూడా మ‌రో మంత్రి జోగి ర‌మేష్ పూర్తి గా వెన‌క‌ప‌డిపోయారు. గాజువాక‌లోనూ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ వెన‌క ప‌డిపోయారు. ఇక శ్రీకాకుళంలో మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద రావుతో పాటు ధ‌ర్మ‌న సోద‌రులు ఇద్ద‌రూ కూడా భారీగా వెన‌క ప‌డి పోయారు.

ఇక పుంగ‌నూరులో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డి కూడా వెన‌క ప‌డిపోయిన‌ట్టుగా చెపుతున్నారు. బొత్స‌, దాడిశెట్టి రాజా కూడా పూర్తి గా వెన‌క‌ప‌డిపోయారు. రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కూడా బారీ వెన‌కంజ‌లో ఉన్నారు. ఇక మంగ‌ళ‌గిరి లో నారా లోకేష్ కు ఇప్ప‌టికే ఏకంగా 13 వేల ఓట్ల ఆధిక్యంలోకి దూసుకు పోతున్నారు. ఇక పిఠాపురంలో ప‌వ‌న్ క‌ళ్యాన్ కు ఏకంగా ఇప్ప‌టికే 12 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకు పోతున్నారు. ఇక విశాఖ ప‌ట్నం జిల్లాలోనూ టీడీపీ అభ్య‌ర్థులు దూసుకు పోతున్నారు. ఇక జ‌న‌సేన అయితే పోటీ చేసిన 22 సీట్ల‌లో పోల‌వ‌రం మిన‌హా మిగిలిన అన్నీ సీట్ల‌లోనూ విజ‌యం దిశ‌గా దూసుకు పోతుంద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: