హే రామ్‌ : యూపీలో బీజేపీ వెనుకంజ..?

Veldandi Saikiran
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్... ఇండియా వ్యాప్తంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ లో... ఎన్డీఏ కూటమికి... ఇండియా కూటమి దూసుకు వెళ్తోంది. సర్వే సంస్థలన్నీ ఎన్డీఏ కూటమి వార్ వన్ సైడ్ అన్నట్లుగా గెలుస్తుందని... స్పష్టం చేశాయి. కానీ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇండియా కూటమే అద్భుతమైన ఫలితాలతో దూసుకుపోతోంది.
 ఇక్కడ తగ్గేదే లేదన్నట్లుగా ముందుకు వెళ్తోంది. బిజెపి పార్టీలో నరేంద్ర మోడీ లాంటి అగ్ర నేతలకు కూడా  ఒక్కో రౌండ్ లో షాక్ ఇచ్చేలా దూసుకు వెళ్తోంది. ఇప్పటికే వారణాసిలో.... ప్రధాని నరేంద్ర మోడీని వెనక్కి నెట్టాడు కాంగ్రెస్ అభ్యర్థి అజయ్. ఇక ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా... బిజెపి పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
 ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి పార్టీ 32 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. కానీ ఇండియా కూటమి 48 స్థానాలలో లీడింగ్ లో ఉన్నారు. దీంతో బిజెపి నేతలు కంగు తింటున్నారు. అయోధ్యలో రామ మందిరం... ఇటీవల నిర్మించింది ఎన్డీఏ ప్రభుత్వం. దీంతో... ఉత్తరప్రదేశ్లో భారీ స్థాయిలో పార్లమెంటు స్థానాలు గెలుస్తామని... బిజెపి పార్టీ అంచనా వేసుకుంది. ఉన్న 80 పార్లమెంటు స్థానాలలో కనీసం 70 స్థానాలు గెలుస్తుందని... ఎన్డీఏ కూటమి అనుకుందట.
 కానీ రియాలిటీలో బిజెపి పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో బిజెపి పార్టీ ప్రభావం ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా... రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాలలో లీడింగ్ లో ఉన్నారు. వయనాడు అలాగే రాయబరేలి  రెండు పార్లమెంటు స్థానాలలో రాహుల్ గాంధీ లీడింగ్ లో ఉండడం గమనార్హం. అయితే నరేంద్ర మోడీ మాత్రం... వెనుకంజలో ఉన్నారు.అయితే.. మరి కొన్ని రౌండ్లలో బీజేపీ అధిక్యంలోకి వస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: