పల్నాడు (పెదకూరపాడు ): మామను తొక్కి పరుగులు పెడుతున్న అల్లుడు..!

FARMANULLA SHAIK

ఆంధ్రప్రదేశ్ లో మే 13న  జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై అధికార, విపక్ష పార్టీలు ఎవరికి వారే తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేశారు పలు నియోజకవర్గాల్లో హోరా హోరీ పోరు సాగింది. అందులోను పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పకుంటే ఇక్కడ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి..టీడీపీ కి కంచు కోట అయిన ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా మళ్ళీ తిరిగి సాదించుకోవాలని టీడీపీ బలమైన వ్యూహ రచన చేసింది. పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ బరిలో నిలిచారు. భాష్యం ప్రవీణ్ పేరు మొదట గుంటూరు పశ్చిమంలో వినిపించింది. ఆ తరువాత చిలకలూరిపేట లో కూడా వినిపించింది. ఎట్టకేలకు పెదకూరపాడులో సీటు దక్కింది. వైసీపీ నుండి నంబూరు శంకర్రావు బరిలో ఉన్నారు.


మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కొమ్మాలపాటి శ్రీధర్ మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు ఎంతగానో ప్రయత్నించారు.2009,2014 ఎన్నికల్లో గెలిచిన శ్రీధర్ 2019 వైసీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు చేతిలో ఓడిపోయారు. ఈ సారి ఎన్నికల్లో శ్రీధర్ కు అనుకూల వాతావరణం లేదనే సర్వే తేలడంతో కొత్త అభ్యర్థి కి టిక్కెట్టు ఇచ్చినట్లు టీడీపీ పేర్కొనింది. దీనితో కొమ్మాలపాటీ శ్రీధర్ క్యాడర్ కాస్త నిరుత్సాహానికి గురిఅయినట్లు తెలుస్తుంది. అధినేత చంద్రబాబు హామీ ఇవ్వటంతో అధిష్టానం నిర్ణయమే తనకి శిరోధార్యం అని శ్రీధర్ ప్రకటించారు భాష్యం ప్రవీణ్ కి సహకరించి అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ఆయన సిద్ధం అయ్యారు.ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం టిడిపి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వైసిపి అభ్యర్థి నంబూరు శంకరరావు పై  ఆదిక్యంతో దూసుకుపోతున్నారు.భాష్యం ప్రవీణ్ ఒక గెలుపు పై పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారని అక్కడ చేసిన సర్వేలో తెలుస్తుంది.భాష్యం ప్రవీణ్ తన ప్రత్యర్థి నంబూరు శంకర్రావుకు వరసకు అల్లుడు అవుతాడన్నది తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: