ఏపీలో మ్యాజిక్ ఫిగర్ దాటిన కూటమి.. ఇక సంబరాలకు సిద్ధం కావాల్సిందే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతుందని పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చేసింది. రాష్ట్రంలో 112 స్థానాల్లో కూటమి లీడ్ లో ఉంటే కేవలం 17 స్థానాల్లో వైసీపీ లీడ్ లో ఉంది. వైసీపీ కంచుకోటల్లో సైతం కూటమి పాగా వేయనుందని తేలిపోయింది. రాష్ట్రంలో కూటమి శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లో సైతం ఫలితాలు దారుణంగా ఉండబోతున్నాయి.
 
ఏపీలో సైలెంట్ వోటింగ్ జరగగా ఆ సైలెంట్ ఓటింగ్ కూటమికి అనుకూలంగా ఉన్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఉదయం 10 గంటల నుంచి తాము లీడ్ కనబరుస్తామని వైసీపీ నేతలు ఆశ పడుతున్నా ఆ ఆశలు అడియాశలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే విధంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉండబోఉన్నాయని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
 
ఏపీలోని మెజారిటీ నియోజకవర్గాల్లో తిరుగులేని మెజార్టీతో కూటమి అభ్యర్థులు అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోయింది. జగన్ ను మించి సంక్షేమం అమలు చేస్తామని చెప్పిన బాబు మాటలనే ఏపీ ఓటర్లు నమ్మారని తేలిపోయింది. వైసీపీ నేతలు మాత్రం ఫలితాలు తమకు అనుగుణంగా రావచ్చని నమ్ముతున్నారని తెలుస్తోంది. వైసీపీ ఆశలు గల్లంతు కావడంతో పాటు మెజారిటీ మంత్రులకు దిమ్మతిరిగే ఫలితాలు వస్తున్నాయి.
 
వైసీపీ మంత్రులలో చాలామంది ఈ ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. కచ్చితంగా గెలుస్తారని భావించిన అభ్యర్థులు సైతం ఓటమి అంచులకు దగ్గరగా ఉండటం గమనార్హం. మరో 3 గంటల్లో తుది ఫలితాలకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది. వైసీపీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని స్వయంగా ఆ పార్టీ నేతలే చెబుతుండటం గమనార్హం. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. జగన్ చేసిన చిన్నచిన్న తప్పులే వైసీపీని ముంచేయబోతున్నాయని ఆ పార్టీ నేతలు ఫీలవుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి కొన్ని ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: