ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు. ఈయన ఉగ్రం అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ కేవలం కన్నడ భాషలో మాత్రమే విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించడంతో ఈయనకు కన్నడ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన కే జి ఎఫ్ అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమాను తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈయనకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది.
ఇకపోతే ఈ దర్శకుడు ఆఖరుగా సలార్ పార్ట్ 1 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మరికొన్ని రోజుల్లోనే సలార్ పార్ట్ 2 ను మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ , ఎన్టీఆర్ హీరో గా ఓ మూవీ ని చేయనున్నట్లు అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశాడు. గతంలో ఈ సినిమా షూటింగ్ను ఈ సంవత్సరమే ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఎప్పటికీ కూడా ప్రారంభం కాలేదు. ఇకపోతే ప్రశాంత్ మరికొన్ని రోజుల్లోనే సలార్ పార్ట్ 2 మూవీ షూటింగ్ను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
సలార్ పార్ట్ 2 మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాతే తారక్ తో సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో ప్రశాంత్ ఉన్నట్లు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అదే కానీ జరిగితే ఇప్పట్లో తారక్ , ప్రశాంత్ కాంబో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే తారక్ , ప్రశాంత్ కాంబోలో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం తారక్ "వార్ 2" అనే హిందీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.