అల్లు అర్జున్ దెబ్బ.. ఆ పని చేయడానికి భయపడుతున్న హీరోలు..!

Divya
పుష్ప 2 సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా ఇప్పట్లో కలెక్షన్స్ పరంగా ఆగేలా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో బాహుబలి 2 సినిమా కలెక్షన్స్ ని కూడా దాటి దూసుకుపోతోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ఈ సినిమా కలెక్షన్స్ గురించి డిస్కషన్ కనిపించలేదు. కేవలం సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన, అల్లు అర్జున్ పైన కేసు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల వ్యవహారమే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోకస్ అయ్యింది.

ఈ ఒక్క సంఘటన టాలీవుడ్ సినీ పరిశ్రమనే డైలామాలో పడేసేలా చేసింది. భారీ బడ్జెట్ వరల్డ్ వైస్ గా రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా సిద్ధంగానే ఉన్నాయి. ఈ సందర్భంలోనే స్టార్ హీరోలు ప్రొడ్యూసర్స్ సైతం అలర్ట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు పబ్లిక్ ఈవెంట్స్ పెట్టవద్దంటూ కూడా భావిస్తూ ఉన్నారు. సంక్రాంతికి సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ కూడా సినిమా ప్రమోషన్స్ ని కేవలం సోషల్ మీడియా వేదికగానే చేయాలంటూ ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందాలు.

గతంలో భారీ ఓపెన్ ప్లేస్ లో ఈవెంట్స్ ఎక్కువగా చేసేవారు.. కానీ ఈ మధ్య ఇలాంటివేవి చేయొద్దు అంటూ నిర్మాతలకు హీరోలే చెబుతున్నారట. అంతేకాకుండా అభిమానులు కూడా ఎవరు తమను కలవడానికి గుంపులు గుంపులుగా రావద్దు అంటూ వెల్లడిస్తున్నారట. ఈనెల 29వ తేదీన విజయవాడలో గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి కటౌట్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేశారు. ఇందుకు అభిమానులు కూడా భారీ సంఖ్యలో రావడానికి సిద్ధమైన కానీ చిత్ర బృందం  అక్కడికి ఎక్కువగా అభిమానులు రాకుండా చూసుకొనేలా చేస్తున్నారట. అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడడంతో పాటు మీడియా, సోషల్ మీడియా వేదికగానే ఈవెంట్స్ ని ప్లాన్ చేసేలా చూస్తున్నారట.

కానీ ప్రమోషన్స్ అనేది చేయకపోతే ఎలా అని నిర్మాతలు భయపడుతూ ఉండగా ఈవెంట్స్ చేస్తే ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందో అంటూ హీరోలు భయపడుతున్నారట. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తే పబ్లిక్ లోకి వెళుతుందా అనే డైలామాలో కూడా నిర్మాతలు ఉన్నారట. మొత్తానికి అల్లు అర్జున్ దెబ్బకి సినీ ఇండస్ట్రీలో అటు నిర్మాతలకు హీరోలకు ఈవెంట్స్ చేయాలంటేనే భయం పుట్టేలా అవుతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: