అడుగు దూరంలో పుష్ప 2..బాహుబలి 2 రికార్డు బద్దలు కొడతాడా..?

murali krishna
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి రెండు వారాలు అవుతున్న ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే 1000 కోట్లు కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరిన్ని కలెక్షన్స్ లు సాధిస్తూ దూసుకుపోతోంది. థియేట్రికల్ రైట్స్ రూ. 600 కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. థియేటర్స్ లోకి రాకముందే పుష్ప 2 మూవీ నిర్మాతలకు లాభాలు పంచింది. ఇక ప్రాఫిట్స్ లో షేర్ తీసుకున్న అల్లు అర్జున్ రూ. 300 కోట్ల వరకు రెమ్యూనరేషన్ రూపంలో తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమా మరొక 300 కోట్లు రాబడితే ఏకంగా బాహుబలి 2 సినిమా రికార్డులను అధిగమిస్తుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి 2 సినిమా 2017 లో విడుదల అయ్యి దాదాపుగా రూ. 1810 కోట్ల గ్రాస్ వసూలు చేసిన విషయం తెలిసిందే. పుష్ప 2 విడుదలై 15 రోజులు అవుతోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 1500 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. హిందీ వెర్షన్ రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ పుష్ప 2 చిత్ర వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
దానికి తోడు ఈ సినిమాకు పోటీ సినిమాలు పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా ఇక వరల్డ్ వైడ్‌గా చూస్తే. ఇప్పటి వరకు 1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్రాస్ చేసినట్లుగా చెబుతున్నారు. అంటే బాహుబలి 2కి మరో అడుగు దూరంలో మాత్రమే ఉంది పుష్ప 2. మరో వంద కోట్లు రాబడితే బాహుబలి 2 రికార్డ్ బద్దలు కానుంది. బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ రూ. 1800 కోట్లకు పైగా ఉంది. ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా చూస్తే సెకండ్ ప్లేస్‌లో బాహుబలి ఉండగా రెండు వేల కోట్లతో దంగల్ మూవీ టాప్ ప్లేస్‌లో ఉంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవి లేకపోవడంతో బాహుబలి 2 రికార్డ్‌ను పుష్ప2 బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అదే జరిగితే రాజమౌళిని వెనక్కి నెట్టి సుకుమార్ టాప్ ప్లేస్‌కి వెళ్లిపోయినట్టే.ఈ క్రమంలో పుష్ప 2 ఎనిమిదేళ్ల క్రితం బాహుబలి 2 నెలకొల్పిన అత్యధిక వసూళ్ల రికార్డు బ్రేక్ చేయడం సాధ్యమే అంటున్నారు. కాగా దంగల్ మూవీ రూ. 2000 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. డొమెస్టిక్ గా బాహుబలి 2, పుష్ప 2 మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. బాహుబలి 2 హిందీ వెర్షన్ రికార్డును పుష్ప 2 పదకొండు రోజుల్లో దాటేసింది. నార్త్ లో కొన్ని ఏరియాల్లో పుష్ప 2 థియేటర్స్ ఎదుట హౌస్ ఫుల్ బోర్డ్స్, క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. చూస్తుంటే ఈ సినిమా బాహుబలి 2 సినిమా రికార్డులను బద్దలు కొట్టేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: