సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య దూరంపెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు.గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు, అల్లు అర్జున్ అరెస్టు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ఈ సమావేశం విషయంలో నిర్మాత, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌చైర్మన్ దిల్‌రాజు కీలకంగా వ్యవహిస్తున్నారు. అయితే సీఎంతో భేటీలో సినీ పెద్దలు ఎవరెవరు పాల్గొంటున్నారనే ఇంకా తెలియరాలేదు.అయితే చిరంజీవి, వెంకటేశ్, అల్లు అరవింద్, త్రివిక్రమ్, హరీశ్ శంకర్, సురేశ్‌బాబు, నితిన్, వరుణ్‌తేజ్, శివ బాలాజీ, పుష్ప సినిమా నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తున్నది. ఇక ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ పాల్గొననున్నారు. కాగా, ఈ సమావేశానికి చిరంజీవి దూరం కానున్నట్లు తెలుస్తున్నది. పలు కారణాలతో ఆయన భేటీకి హాజరుకాకపోవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. మెగా ఫ్యాన్స్‌కూడా తమ బాస్ దూరంగానే ఉండనున్నారని పోస్ట్ చేస్తున్నారు. దీనిపై మరికాసేపట్లో క్లారిటీ రానున్నది.
ఇదిలావుంటే ఇక రేవంత్ రెడ్డి వ్యక్తిగత విషయానికి వస్తే, అతను సినిమాలు చూస్తారా, అతనికి ఏ నటుడు అంటే ఇష్టం అని చాలామందికి ఆసక్తికరంగా వుండే ప్రశ్న. అయితే ఆమధ్య చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తనకి సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎంతో అభిమానం అని చెప్పేవారు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు ఎక్కువగా చూసేవాడినని, అతనికి అభిమానిని అని చెప్పారు రేవంత్ రెడ్డి పలు ఇంటర్వ్యూలలో. ఇప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ అలాగే కృష్ణ గారి పుట్టినరోజు నాడు రేవంత్ రెడ్డి చేసిన ఒక పోస్ట్ కూడా ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి సూపర్ స్టార్ కృష్ణ అభిమాని.తరంలో ఎవరు బాగా ఇష్టమైన నటుడు అని అడిగినప్పుడు, ఇప్పుడు తాను అంతగా సినిమాలు చూడనని, అప్పుడప్పుడు ఏవో సినిమాలు చూస్తూ ఉంటాను అని రేవంత్ రెడ్డి చెప్పారు, అంతేకానీ ప్రత్యేకంగా పలనా నటుడు అంటే అభిమానం లేదు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం కృష్ణగారు అంటే అభిమానం అని, అతని సినిమాలు అప్పట్లో చాలా చూసేననివాడి చెప్పారు. అతను రెండేళ్ల క్రితం కృష్ణగారి పుట్టినరోజు నాడు ఎక్స్ లో చేసిన పోస్ట్ సాంఘీక మాధ్యమంలో బాగా వైరల్ అవుతూ ఉండటం విశేషం.