అక్రమ సంబంధాలపై ఆరా తీసిన సర్వే..టాప్ ప్లేస్ లోనున్న రాష్టం అదే.?

FARMANULLA SHAIK
అక్రమ సంబంధాలపై యన్ ఎఫ్ హెచ్ ఎస్ నిర్వహించిన ఓ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. పురుషులకంటే మహిళలే ఎక్కువగా శృంగార భాగస్వాములను కలిగివున్నట్లు వెల్లడైంది. స్త్రీలు సగటున 3/1 వంతు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటున్నట్లు సర్వే పేర్కొంది. ఈ మేరకు యన్ ఎఫ్ హెచ్ ఎస్-5 భారతదేశంలోని 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 707 జిల్లాల్లో సర్వే నిర్వహించింది. పురుషులు, మహిళల దగ్గరనుంచి రహస్యంగా సేకరించిన వివరాల ఆధారంగా మహిళలే ఎక్కువశాతం సెక్స్ భాగస్వాములను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్త్రీల సగటు 7 శాతం కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. జీవిత భాగస్వామి కాకుండా  సన్నిహితంగా ఉండే స్త్రీలతో పురుషులు 4 శాతం లైంగిక సంబంధాలు కలిగివున్నట్లు పేర్కొంది.ఇక 1.1 లక్షల మంది మహిళలు, 1లక్ష మంది పురుషులు చెప్పిన వివరాల ప్రకారం సగటున మహిళలు 3/1 శాతం సెక్స్ పార్టనర్‌లను కలిగి ఉన్నారని సర్వే నిర్వాహకులు వెల్లడించారు. పురుషుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు. ఇక రాజస్థాన్‌లో అత్యధిక శాతం 8/1గా ఉన్నట్లు వెల్లడించారు. 
హర్యానా, చండీగఢ్, జమ్మూ, కాశ్మీర్, లడఖ్, మధ్యప్రదేశ్, అస్సాం, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు ప్రాంతాల్లో జీవిత భాగస్వామి లేదా లివ్-ఇన్ రిలేషన్స్ సంబంధం కలిగి ఉన్న స్త్రీలు 4శాతం ఉన్నారు. పురుషుల విషయంలో ఈ సంఖ్య 0.5 శాతంగా ఉందని తెలిపారు. ఇదిలావుండగా
15-24 ఏళ్లలోపు లైంగిక సంబంధం కలిగి ఉన్న అమ్మాయిల శాతం 2 -3గా ఉంటే పురుషులు 0.5 నుంచి 0.9 శాతం ఉన్నారు. ఇక 25-49 సంవత్సరాల పట్టణాల్లో నివసించే మహిళలు గ్రామీణ మహిళల కంటే రెండేళ్లు ఆలస్యంగా సెక్స్ ప్రారంభిస్తారని డేటా పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో మహిళలు 20 ఏళ్లకు, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు 18 సంవత్సరాలకే శృంగారంలో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. ఇక స్త్రీలలో 10 శాతం మంది 15 సంవత్సరాలకే సెక్స్ అనుభవం కలిగి ఉన్నారని గుర్తించింది. 25-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 60 శాతం మంది లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు తెలిపింది.ఇక కొంతమంది బాలికలు తమ మొదటి సంభోగం పాఠశాల దశలోనే ప్రారంభిస్తున్నట్లు సర్వేలో తేలింది. కొంతమంది పురుషులు కూడా 12 ఏళ్లకే లైంగిక కోరికలతో డబ్బులు చెల్లించి కోరిక తీర్చుకుంటున్నారని తెలిపింది. లైంగిక సంభోగం సమయంలో 51 శాతం మంది పురుషులు కండోమ్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. ఇక అమ్మాయిల్లో ఎక్కువ శాతం అబార్షన్‌లు ప్రైవేట్ హెల్త్ సెక్టార్‌లో 53% జరిగినట్లు వెల్లడించారు. 20 శాతం పబ్లిక్ హెల్త్ సెక్టార్‌లో జరిగాయి. నాల్గవ వంతు 27% కంటే ఎక్కువ గర్భస్రావాలు స్త్రీలు స్వయంగా ఇంట్లోనే చేయించుకుంటున్నట్లు సర్వే ఆధారంగా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: