రిస్కీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరో!

Amruth kumar
తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు తీయడం అంటే కత్తి మీద సామే. ‘జెర్సీ’ లాంటి క్లాసిక్స్ వచ్చినా, నాని ‘భీమిలి కబడ్డీ జట్టు’ లాంటి ఎమోషనల్ రైడ్స్ ఉన్నా.. కమర్షియల్ లెక్కల దగ్గరకు వచ్చేసరికి స్టార్ హీరోలు ఈ జోనర్‌ను టచ్ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. గతంలో బాక్సింగ్ రింగులోకి దిగి ‘గని’తో భారీ దెబ్బ తిన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మళ్ళీ అదే స్పోర్ట్స్ జోనర్‌పై మనసు పడ్డారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో ‘పూనకాలు’ తెప్పిస్తోంది.వరుణ్ తేజ్ ఈసారి పక్కా ‘మాస్’ ప్లానింగ్‌తో వస్తున్నట్టు తెలుస్తోంది.



ఇటీవలే ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ యదు వంశీ, వరుణ్ తేజ్ కోసం ఒక అదిరిపోయే కథను సిద్ధం చేశాడట.మన దగ్గర క్రికెట్ మాయలో పడి వాలీబాల్‌ను మర్చిపోయాం కానీ, ఈ ఆటలో ఉండే ఎమోషన్, స్పీడ్ వేరే లెవల్. ఇప్పుడు ఇదే ఆటను మెయిన్ పాయింట్‌గా తీసుకుని ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ మిక్స్ చేసి యదు వంశీ ఈ కథను రాసుకున్నారట.ఈ కథ వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక కొణిదెలకు బాగా నచ్చడంతో, ఆమె స్వయంగా ఈ సినిమాను నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అన్నయ్య కోసం ఒక భారీ స్పోర్ట్స్ డ్రామాను ప్లాన్ చేస్తోంది మెగా ప్రిన్సెస్.



నిజానికి ఈ యదు వంశీ ముందుగా మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక కథ రాసుకుని నిహారిక రిఫరెన్స్‌తో వినిపించాడట.ఫైనల్ నెరేషన్‌లో మెగాస్టార్‌ను మెప్పించడంలో కుర్రాడు కొంచెం తడబడటంతో, ఆ అవకాశం కాస్తా వరుణ్ తేజ్ దగ్గరకు వచ్చింది.అయితే చిరంజీవి గారికి చెప్పిన కథ వేరు, వరుణ్ కోసం సిద్ధం చేసిన వాలీబాల్ కథ వేరని మెగా కాంపౌండ్ టాక్. ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న వరుణ్, తన డిజాస్టర్ల పర్వానికి ఈ సినిమాతో శుభం కార్డు పలకాలని చూస్తున్నాడు.వరుణ్ తేజ్ తన స్పోర్ట్స్ డ్రామాతో డిఫరెంట్ రూట్ ఎంచుకున్నాడు. ‘గని’ కోసం పడిన కష్టానికి బాక్సాఫీస్ రిజల్ట్ రాలేదన్న వెలితిని ఈ వాలీబాల్ సినిమాతో తీర్చుకోవాలని వరుణ్ కసితో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: