పవన్ మాటలకు స్టేడియం షేక్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్ హైలైట్స్!
ఈ సినిమాలో హరీష్ శంకర్ రాసిన ఒక డైలాగ్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దానిపై పవన్ తనదైన స్టైల్లో స్పందించారు. "సినిమాలో డైలాగ్ షార్ప్‌గా ఉండొచ్చు.. కానీ నా వ్యక్తిగత జీవితంలో నాది ఇచ్చిపడేసే గోత్రం కాదు.. మిమ్మల్ని ప్రేమించే గోత్రం. ఇరగదీసే నక్షత్రం కాదు.. మీకు సేవ చేసే నక్షత్రం" అని పవన్ చెప్పగానే ఫ్యాన్స్ ఊగిపోయారు. తనకు అంతర్జాతీయ గుర్తింపును, సమాజానికి సేవ చేసే స్థాయిని ఇచ్చింది సినిమా రంగమేనని, ఈ రంగుల ప్రపంచాన్ని తన గుండెల్లో నుంచి ఎవరూ వేరు చేయలేరని ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.
వేదికపై దర్శకుడు బుచ్చిబాబు సానా పవన్‌ను ఉద్దేశించి ‘మా ఎమ్మెల్యే’ అని పిలవడం అందరినీ ఆకట్టుకుంది.యువ దర్శకులు, ప్రజలు తనపై చూపిస్తున్న ఈ అపారమైన నమ్మకం తన బాధ్యతను మరింత పెంచుతోందని పవన్ అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు ఏవైనా, తన వెంటే ఉండే సైనికులు తన అభిమానులేనని కొనియాడారు."హరీష్‌కు మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది" అని తన దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు.
ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై పవన్ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు. "ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది" అంటూ పవన్ తనదైన స్టైల్లో చెప్పిన మాటలు ఇప్పుడు ఇంటర్నెట్లో ‘మంట’ పుట్టిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, థమన్ బిజిఎం తోడైతే థియేటర్లలో పండుగ వాతావరణం ఖాయమని తేల్చేశారు.పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ‘ఉస్తాద్’ మేనియాలో మునిగిపోయారు. శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్, పవన్ కళ్యాణ్ స్వాగ్ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలైనట్టే!