కుర్రాడిని గెలికిన కోహ్లీ.. గొడవతో హీట్ పెంచేసాడుగా?

praveen

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ డ్రామా. మాటల యుద్ధాలు, ఉత్కంఠభరిత క్షణాలు, రసవత్తర పోరు.. ఇవన్నీ కామన్. MCG (మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్)లో జరిగిన నాల్గవ టెస్టులోనూ అలాంటి సీనే రిపీట్ అయింది. భారత స్టార్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా యువ ఆటగాడు శామ్ కాన్స్టాస్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఇద్దరూ అనుకోకుండా ఒకరినొకరు తాకడంతో కాన్స్టాస్ కాస్త అసహనానికి గురయ్యాడు. కోహ్లీని వెంటనే నిలదీయడంతో అతను ఎదురు తిరిగాడు. డెత్ వార్నింగ్ లాగా సంచలన లుక్ ఇచ్చాడు. ఇలా కోహ్లీ కుర్రాడిని గెలకడం వల్ల ఆ గొడవ బాగా హీట్ ఎక్కింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా బ్యాటర్‌, అంపైర్ కలుగచేసుకోవాల్సి వచ్చింది.
అయితే, ఈ చిన్నపాటి గొడవతో కాన్స్టాస్ ఆట ఏమాత్రం తగ్గలేదు. తొలి టెస్టులోనే అదరగొట్టాడు. కేవలం 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, తన సత్తా ఏంటో చూపించాడు. గురువారం కాన్స్టాస్ ఓ రికార్డు సృష్టించాడు. 19 ఏళ్ల 85 రోజుల వయసులో ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టిన నాల్గవ పిన్న వయస్కుడిగా నిలిచాడు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ చేతుల మీదుగా తన 'బాగ్గీ గ్రీన్' క్యాప్ అందుకున్నాడు. కాగా, ఆస్ట్రేలియా తరఫున అత్యంత పిన్న వయసులో టెస్టు ఆడిన రికార్డు ఇయాన్ క్రెయిగ్ పేరిట ఉంది. 1953లో 17 ఏళ్ల 239 రోజుల వయసులో అతను అరంగేట్రం చేశాడు. ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్ (18 ఏళ్ల 193 రోజులు) రెండో స్థానంలో ఉండగా, టామ్ గారెట్, క్లెమ్ హిల్ టాప్-5 లిస్టును పూర్తి చేస్తున్నారు.


కాన్స్టాస్ పేరు క్రికెట్ వర్గాల్లో మార్మోగడానికి కారణం పెర్త్ టెస్ట్ తర్వాత ప్రధాని XIతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై చేసిన సెంచరీ. ఆ ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ తన సత్తా చాటుతున్నాడు. 11 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 42.2 సగటుతో ఏకంగా 718 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.
ఇక, ICC అండర్-19 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియా విజయంలో కొనస్టాస్ కీలక పాత్ర పోషించాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీతో కలిపి మొత్తం 191 పరుగులు చేశాడు. ఇండియా-ఎతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ రాణించి 92 పరుగులు చేశాడు. అందులో 73* అతని అత్యధిక స్కోరు. అంతేకాదు, పింక్ బాల్ వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. కేవలం 97 బంతుల్లోనే 107 పరుగులు చేసి అదరగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: