అరెస్ట్ అయినా..జైల్లో పెట్టినా.. అమ్మనా బూతులు తిట్టీనా.. ఆ విషయంలో అల్లు అర్జున్ తగ్గేదేలే..!

Thota Jaya Madhuri
ఇప్పుడు అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో ఎంత రాద్ధాంతం క్రియేట్ చేస్తుందో అందరికీ తెలుసు . అసలు అల్లు అర్జున్ పేరు ఇంతలా దిగజారిపోతుంది అంటూ ఎవరు ఊహించలేకపోయారు . మరి ముఖ్యంగా పుష్ప2 సినిమా కారణంగా ఆయన ఈ విధంగా లీగల్ పరంగా చిక్కులు ఎదుర్కొంటాడు అంటూ అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు . నార్మల్ గానే సంధ్యా థియేటర్ కి తను నటించిన సినిమా చూడడానికి వెళ్ళాడు . అక్కడ బన్నీను చూడడానికి జనాలు ఎగబడి పోయారు .


దీంతో తొక్కిసలాట జరిగింది . ఆ తర్వాత రేవతి అనే మహిళ మృతి చెందింది . దీంతో అల్లు అర్జున్ ఊహించని చిక్కుల్లో ఇరుక్కుపోయాడు.  అయితే అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి మాట్లాడిన కొన్ని మాటలు హాట్ టాపిక్ గా మారాయి . బన్నీ హెడ్ వెయిట్ తోనే ఇలా చేశాడు అంటూ కొంత్మంది జనాల్లు మాట్లాడుకున్నారు. చాలామంది పొలిటిషియన్స్ అల్లు అర్జున్ ని అమ్మనా బూతు పదాలతో తిడుతున్నారు.  సోషల్ మీడియాలో అయితే ఏ  విధంగా రాద్ధాంతం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం .


అయితే అల్లు అర్జున్ క్రేజ్ అదేవిధంగా రేంజ్ మాత్రం తగ్గ లేదు . చాలామంది అల్లుఅర్జున్ అరెస్ట్ అయిన కారణంగా ఆయన ఫ్యాన్ బేస్ తగ్గిపోతుంది అని .. క్రేజ్ ఢమాల్ అని పడిపోతుంది అంటూ భావించారు . అదేవిధంగా ట్రోలింగ్ కూడా చేశారు . కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో అస్సలకి తగ్గేదెలా అంటూ తన క్రేజ్ ని పాపులారిటీని ఇంకా పెంచుకుంటూనే పోతున్నాడు . సాధారణంగా ఇలా జరిగితే ఏ మనిషి పరువు అయిన గంగలో కలిసిపోతుంది. కన్నీ బన్నీ మాత్రం తన ఫ్యాన్ బేస్ రెట్టింపు అయ్యేలా చేసుకున్నాడు. నిజంగా ఈ విషయంలో అల్లు అర్జున్ గ్రేట్ అంటున్నారు అభిమానులు. ఇప్పుడు ఎక్కడ చూసిన అల్లు అర్జున్ ని పుష్ప 2 విషయంలో పొగిడేసే జనాలే ఎక్కువుగా కనిపిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: