‘మన డాక్టర్ బాబే’ రివ్యూ.. అందరూ చూడదగ్గ చిత్రం

Reddy P Rajasekhar

శరణ్య, సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద కృతాక్షి నిర్మాణంలో తెరు చలపతి కుమార్ పువ్వల తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో మోహన సిద్ధి, శృతి శంకర్, అలీ, రాజీవ్ కనకాల, శాంతి, కోటేశ్వరరావు ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ మూవీని నవంబర్ 20న రిలీజ్ చేశారు. ఫ్యామిలీతో కలిసి చూసేలా చక్కటి వినోదాత్మకంగా వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్‌ని ఏ మేరకు ఆకట్టుకుంది? అన్నది ఓ సారి చూద్దాం.

కథ
రాజు (శ్రీ స్కంద) చిన్నతనంలోనే అమ్మానాన్నల్ని కోల్పోతాడు. మేనమామ దుర్గారావు (రాజీవ్ కనకాల) రాజుని అంతగా ఇష్టపడడు. రాజుకి తన కూతురు సింధు (శ్రుతి శంకర్)ని ఇచ్చి పెళ్లి చేయాలంటే దుర్గారావ్ ఓ కండీషన్ పెడతాడు. డాక్టర్ అయితేనే తన అల్లుడిగా చేసుకుంటాను అని, కూతురితో పెళ్లికి ఒప్పుకుంటాను అని అంటాడు. దీంతో రాజు తన మరదలి కోసం కష్టపడి డాక్టర్ అవుతాడు. డాక్టర్‌వి అయ్యావ్ కానీ.. ఆండ్రాలిజ్ట్‌వి.. నీకు నా కూతురిని ఇవ్వను.. డాక్టర్ పక్కన ఆ పేరుని తీసేస్తే ఇస్తాను అని అంటాడు దుర్గారావు. కానీ శ్రీ స్కంద మాత్రం దానికి ఒప్పుకోడు. అసలు శ్రీ స్కంద ఆండ్రాలజిస్ట్ ఎందుకు అయ్యాడు? ఈ ప్రయాణంలో రాజుకి వచ్చిన సమస్య ఏంటి? ఈ కథలో డాక్టర్ సుఖం (అలీ),  గౌతమి (మోహన సిద్ది), తాత రత్నం (కోటేశ్వరరావు) పాత్రలు ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
ఓ అందమైన గ్రామం.. అందులోని ప్రేమలు.. మేనమామ, మరదలు, బావ అనే కాన్సెప్ట్ ఎంతో నేచురల్‌గా, రియలిస్టిక్‌గా ఉంటుంది. ఈ పాత్రలోనే ఎంతో భావోద్వేగమైన కథల్ని రాసుకోవచ్చు. ఆ బంధాల మధ్య ఎంత సంఘర్షణ ఉంటే.. సినిమా అంతగా మెప్పిస్తుంది. ప్రేమలో అబ్బాయి, అమ్మాయి ఎదుర్కొనే కష్టాలు, వారి బాధలే ఆడియెన్స్‌ని కట్టి పడేస్తుంటాయి. ఇక ఇలాంటి ప్రేమ కథలకు కాస్త కామెడీ టచ్ ఇస్తూ, అడల్ట్ కంటెంట్‌ని బార్డర్ దాటకుండా చూపించే ఈ సినిమాని చలపతి చక్కగా తెరకెక్కించాడు.

ఫస్ట్ హాఫ్ అంతా కూడా అండ్రాలిజిస్ట్ డాక్టర్, అతని చుట్టూ జరిగే కామెడీతో సాగుతుంది. రాజు, గౌతమి ట్రాక్.. మరదలితో ఇంకో ట్రాక్ ఇలా అన్నీ సరదా సరదాగా సాగుతుంటాయి. మేనమామ పెట్టే కండీషన్‌తో ఇంటర్వెల్ బ్లాక్ పడుతుంది. ఆ తర్వాత కథలో మరో ట్విస్ట్ వస్తుంది. అటు నుంచి అప్పటి వరకు సాగిన కామెడీ పక్కకి వెళ్లి ఎమోషనల్‌గా సినిమా సాగుతుంది. హీరోకి చెప్పుకోలేని కష్టం రావడం, ఇద్దరి మధ్య ఇరుక్కోవడం, లైన్ దాటకుండా అడల్ట్ సీన్లను చూపించిన తీరు బాగుంటుంది. చివర్లో ఇచ్చిన మరో ట్విస్ట్ బాగుంటుంది.  చివరకు మంచి ఎమోషనల్, కామెడీ,ఫ్యామిలీ సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.

నటీనటులు
హీరోగా తొలి చిత్రమే అయినా శ్రీ స్కంద ఎంతో ఈజ్‌తో నటించాడు. కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ ఇలా అన్నింట్లో తన మార్క్ చూపించాడు. మోహన సిద్ది, శ్రుతి శంకర్ తెరపై అందంగా కనిపించారు. ఇద్దరి పాత్రలకు తగిన ప్రాధాన్యం లభించింది. తాతగా కోటేశ్వరరావు, మేనమామగా రాజీవ్ కనకాల, శాంతి పాత్రలు బాగుంటాయి. ఇక సెకండాఫ్‌లో అలీతో ఉండే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. మిగిలిన పాత్రల్లో అందరూ తపమ పరిధి మేరకు మెప్పిస్తారు.

సాంకేతిక నిపుణుల పనితీరు..
ఈ మూవీకి కిషోర్ బోయిడపు అందించిన విజువల్స్, అతని కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. మనోజ్ కుమార్ ఇచ్చిన పాటలు, సిట్యువేషన్‌కి తగ్గట్టు ఇచ్చిన బీజీఎం మెప్పిస్తుంది. సెల్వ కుమార్ ఎడిటింగ్ బాగుంటుంది. రామకృష్ణ గరగ ఇచ్చిన కథలో కావాల్సినంత వినోదం, సందేశం ఉంది. ఈ చిత్రంలో రాంబాబు గోశాల, గిరిధర్ రాగోలు, విష్ణు ఎర్రావుల, శర్వణై సిరి రాసిన పాటలు అర్థవంతంగా ఉన్నాయి. మాటలు కూడా ఆకట్టుకుంటాయి. మొదటి ప్రాజెక్ట్ అయినా కూడా నిర్మాణ పరంగా మేకర్స్ ఎక్కడా రాజీ పడలేదు.

రేటింగ్ 3

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: