కెరీర్ పరంగా తప్పటడుగులు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం కీర్తికి కష్టమేనా?
బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం కీర్తికి కష్టమేననే కామెంట్లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాతో లక్ ను పరీక్షించుకోగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. తేరి సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన బేబీ జాన్ మూవీ ప్రేక్షకుల మెప్పును పొందే విషయంలో అయితే ఫెయిల్ అయింది.
కీర్తి సురేష్ ఇకపై నటించే సినిమాలకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కీర్తి సురేష్ కు పెళ్లి తర్వాత నటించిన సినిమా మాత్రం కలిసిరాలేదు. కీర్తి సురేష్ బరువు తగ్గకముందే అందంగా ఉండేవారని తగ్గిన తర్వాత అందంగా కనిపించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
కీర్తి సురేష్ కు అద్భుతంగా నటించే ప్రతిభ ఉన్నా ఆమె చేస్తున్న చిన్నచిన్న తప్పులు కెరీర్ పరంగా మైనస్ అవుతున్నాయని చెప్పవచ్చు. సరైన సినిమాలను ఎంచుకుంటే కీర్తి సురేష్ కెరీర్ పరంగా పుంజుకోవడం మరీ కష్టం అయితే కాదని చెప్పవచ్చు. కీర్తి సురేష్ విభిన్నమైన ప్రాజెక్ట్స్ కు ఓటు వేస్తే కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు ఆమె సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి. 2025 సంవత్సరం అయినా కీర్తి సురేష్ కు కలిసిరావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కీర్తి సురేష్ తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.