ఏపీ: కూటమిని భయపెడుతున్న ఐదు అంశాలు ఇవే?

Chakravarthi Kalyan
ఏపీలో అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీఎం జగన్ ను బలంగా ఎదుర్కొంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.  ఈ క్రమంలో ప్రచారం చేస్తూ.. బలమైన నాయకులను రంగంలోకి దించుతోంది. భారీ ఎత్తున విమర్శలు కూడా గుప్పిస్తోంది.

ఇంత వరకు కూటమి ప్లాన్ బాగానే ఉన్నా.. ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. తొలిరోజు నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. ఈ క్రమంలో అసెంబ్లీకి, లోక్ సభకి చాలామంది నామినేషన్లు వేశారు. అయితే ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఇండిపెండెంట్లు ఎక్కువగా ఉన్నారు.  అంతేకాదు బీఎస్పీ,  తులసి పార్టీ, పిరమిడ్ పార్టీ, ప్రజాశాంతి పార్టీల అభ్యర్థులు భారీ ఎత్తున నామినేషన్లు వేశారు. అంతేకాదు అభ్యర్థుల పేర్లు ఒకేరకంగా ఉన్న నియోజకవర్గాల  సంఖ్య భారీగానే ఉంది.

అభ్యర్థుల ఇంటి పేర్లు ఒకే విధంగా, గుర్తులు కూడా దాదాపు ఒకే విధంగా ఉంటే బకెట్-గ్లాసు లా ఉన్నవి కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. వీరితో పాటు కాంగ్రెస్ కూటమి కూడా తమ అభ్యర్థులను బాగానే బరిలో దింపుతుంది. వైసీపీ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం చేస్తోంది. దీనివల్ల అంతిమంగా టీడీపీ కూటమికే ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది.

మరోవైపు షర్మిళ తన ప్రచారం లో దూకుడు పెంచుతుండగా.. ఇండిపెండెట్లు కూడా తమ ప్రభావాన్ని చాటేందుకు తహతహలాడుతున్నారు. వీరు గెలుస్తారు అనీ చెప్పలేం కానీ.. కూటమి ఓటు బ్యాంకుపై మాత్రం ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏ ఉద్దేశంతో అయితే అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలద్దనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కూటమికి వీరు గండి గొట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరి కూటమి నేతలు వీరిని లైట్ తీసుకున్నారా? లేక అసలు పట్టించుకోవడం లేదా? అన్నది ప్రశ్న. కూటమి వ్యూహం ఎలా ఉందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: