తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ నష్టాలు తప్పవు?

Purushottham Vinay

భోజనం చేసేటప్పుడు మధ్యలో కానీ లేక భోజనం చేసిన తర్వాత కానీ వెంటనే నీరు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే అలా తాగడం వల్ల కచ్చితంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆహారాన్ని జీర్ణం చేయడానికి, జీర్ణవ్యవస్థ తీసుకునే సహజ సమయాన్ని నీరు తాగడం ద్వారా మార్చేస్తున్నట్టు అవుతుంది. ఈ అలవాటు వల్ల ఊహించిన దాని కంటే ముందుగానే ఆకలి వేస్తుంది. అప్పుడు ఎక్కువగా తింటారు. దీనివల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కచ్చితంగా వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ అలవాటు వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మొత్తం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. అలాగే, భోజనం తిన్న వెంటనే నీళ్లు తాగితే బరువు త్వరగా పెరుగుతారని, దీంతో ఊబకాయం బారిన పడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఈ అలవాటు వల్ల జీర్ణ ఎంజైమ్‌లు దెబ్బతింటాయి. 


ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది. జీర్ణక్రియకు లాలాజలం చాలా ముఖ్యం. అయితే, భోజన సమయంలో నీళ్లు తాగడం వల్ల మీ లాలాజలం పలుచన అవుతుంది. సాధారణంగా భోజనంతో పాటు నీళ్లు తాగే వారికి బరువు పెరగడం పెద్ద సమస్యగా మారుతుంది. భోజనం మధ్య నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది.భోజనం చేస్తూ మధ్యలో నీళ్లు తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం సరైన క్రమంలో జీర్ణం కాదు. సాధారణంగా మనం తింటున్న ఆహారంతో మన శరీరంలో జీర్ణ క్రియ జరగడం కోసం కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. అయితే, మనం మధ్యలో నీళ్లు తాగడం వల్ల ఆ రసాయనాల ఘాడత తగ్గి మన ఆహారం సరిగా జీర్ణం కాకుండా చేస్తుంది. ఇలా నీటిని తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని చెబుతారు.కానీ, ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. కాబట్టి కచ్చితంగా ఈ అలవాటు ఉంటే మానుకోండి. లేదంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకు గురవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: