అఖిల్ సినిమా ఆలస్యం..ఆ స్టార్ హీరో సినిమానే కారణమా..?

murali krishna
తె లుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు చిరంజీవి...ప్రస్తుతం చిరంజీవి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాడు.కాగా.. చిరు విశ్వంభర సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో.. భయ్యర్లు మెుగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా మెగాస్టార్ చిరంజీవి, నిలిచేది సంక్రాంతి బరిలో. దాంతో సహజంగానే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ లు రికార్డ్ స్థాయిలో జరుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ లెక్కలు అన్నీ చూసుకున్నాక అఖిల్ మూవీ ప్రారంభిస్తారా? లేక చిరు మూవీ రిలీజ్ అయ్యాకే స్టార్ట్ చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా అఖిల్ భవిష్యత్ ఇప్పుడు చిరంజీవి చేతుల్లో ఉందని మూవీ లవర్స్ తో పాటుగా సినీ పండితులు పేర్కొంటున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో హిట్ అనివార్యమైన హీరోల్లో యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఒకడు. నాగార్జున నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అతడి కెరీర్ లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ ఒక్కటే థియేటర్ల దగ్గర సక్సెస్ సాధించింది. మరే చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక అతడి నుంచి వచ్చిన ఆఖరి చిత్రం ‘ఏజెంట్’. 2023లో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరే మూవీ కూడా అతడిని నుంచి రాకపోగా.. అనౌన్స్ లు కూడా కాలేదు.

ఈ నేపథ్యంలో అఖిల్ భవిష్యత్ మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదెక్కడి కంపారిజన్ అని మీరు అనుకుంటున్నారా?అయితే యూవి క్రియేషన్స్ పై  ఒక చిత్రం వస్తుందని గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. దాదాపుగా దీని బడ్జెట్ 100 కోట్ల దాకా ఉంటుందట.  దీనికి దర్శకుడుగా అనిల్ ఉంటారని  వార్తలు వినిపిస్తున్నాయి.  అంతేకాదు ఈ వీరిద్దరి కాంబోపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.  ఈ పాత్ర కోసం అఖిల్ కూడా వర్కౌట్స్ చేస్తున్నారని, ఇంకోవైపు కథకు మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయని  తెలుస్తోంది.కానీ ఈ చిత్రానికి చిరంజీవి  కాస్త అడ్డుగా ఉన్నట్టు  సమాచారం. యూవీ క్రియేషన్స్ పై చిరంజీవి 'విశ్వంభర' సినిమా తెరకేక్కుతోంది. దాదాపుగా ఈ చిత్రానికి 150 కోట్ల బడ్జెట్ పెట్టారట. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అన్ని అనుకున్నట్టుగా జరిగితే లాభాలు వస్తే, ఇదే బ్యానర్ లో అఖిల్ సినిమా స్టార్ట్ అవుతుందట. అందుకే అఖిల్ సినిమా ఇన్నాళ్ళ నుంచి వాయిదా పడుతూ  వస్తోందని  తెలుస్తోంది.చిరంజీవి కూడా సోషియో ఫాంటసీ  కథతో వస్తున్నారు కాబట్టి యూవీ క్రియేషన్స్ వారు కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వారు అనుకున్నట్టు అన్నీ ఓకే అయితే మాత్రం  అఖిల్ సినిమా తెరికెక్కే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: