ప్రజాస్వామ్యం ఖరీదు: ఎన్నికల పండుగ మొత్తం ఖర్చెంతో తెలుసా?

Chakravarthi Kalyan
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు ఎన్నికల రణక్షేత్రంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. తమ అభ్యర్థుల గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నాయి. బహిరంగ సభలు, ఇంటింటి ప్రచార కార్యక్రమాలు, పత్రికా ప్రకటనలు, టీవీ యాడ్ లు ఇలా పలు మార్గాల్లో ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.

దీని కొసం అన్ని పార్టీల అభ్యర్థులు ఎంత ఖర్చుకు అయినా వెనకాడటం లేదు. అయితే ఈ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అధికారికంగా చేసే ఖర్చుకూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఏటికేడు వ్యయం పెరుగుతుంది. 1947లో భారత్ కు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలిసారి దేశంలో ఎన్నికలు జరిగిన సమయంలో ఎన్నికల నిర్వహణ ఖర్చు దాదాపు రూ.10.45 కోట్లు. అంటే ఒక్కో ఓటరుపై రూ.0.60 పైసా ఖర్చు అయిందన్న మాట.

ఈ ఖర్చు ప్రతి సార్వత్రిక ఎన్నికలకు పెరుగుతూ 2014కి వచ్చే సరికి 16వ లోక్ సభ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.3800 కోట్లు ఖర్చు చేసింది. అంటే ప్రతి ఓటరుపై ఖర్చు రూ.46 అయింది. మొదటి ఆరు సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కో ఓటరుపై అయిన ఖర్చు రూ.1కంటే తక్కువగా ఉంది. ఏడు నుంచి 10వ ఎన్నికల వరకు ఒక్కో ఓటరుపై రూ.10కి మించలేదు.

ఇక 11 నుంచి 15వ లోక్ సభ ఎన్నికలకు ఒక్కో ఎలక్టోర్ పై రూ.10 నుంచి రూ.15.54 మధ్య వరకు అప్పటి ప్రభుత్వాలు ఖర్చు చేశాయి. అది 2014 సాధారణ ఎన్నికల్లో ఒక్కొ ఎలక్టోర్ కు రూ.46.40 వరకు పెరగడం గమనార్హం. 2019లోక్ సభ ఎన్నికల ఖర్చు వివరాలు తెలియలేదు. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లోక్ సభ, శాసన సభ ఎన్నికల నిర్వహణ వ్యయం రూ.4500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ ఖర్చును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 50-50 ప్రాతిపదికన భరిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: