పల్నాడు : కోడెల ఎంట్రీతో ఆ మంత్రి విలవిల ?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గరపడే వేళ అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్ వాతావరణం మొదలైంది.దాంట్లో భాగంగానే పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో కోడెల శివ ప్రసాద్ కి టికెట్ ఇచ్చేవారు.ప్రస్తుతం ఆ టికెట్ ఆయన కొడుకు కోడెల శివరాం ఆశించాడు. కానీ టీడీపీ అధిష్టానం మాత్రమే సీనియర్ నాయకుడు అయినా కన్నా లక్ష్మీనారాయణ కి ఇచ్చారు. దాంతో అసహనానికి గురి అయినా కోడెల శివరాం పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటూ వచ్చారు. అక్కడ వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు బరిలో ఉన్నారు.
ప్రస్తుతం వాతావరణం బట్టి అక్కడ అంబటి మీద ప్రజలు పూర్తి వ్యతిరేకత తో ఉన్నారు. ఆయన్ను ఎలాగైనా ఈసారి ఓడించాలని టీడీపీ ఒక వ్యూహత్మక ప్లాన్ వేసి కోడెలతో మూలఖత్ అవ్వాలని ఆలోచన వేసింది. దాంట్లో భాగంగానే వినుకొండ టీడీపీ ఎమ్మెల్యేగా బరిలో ఉన్న జీవీ ఆంజనేయులు నేత్రుత్వంలో కన్నా మరియు కోడెల శివరాం కలిసే విధంగా చేసారు.అయితే వారి కలయిక సారాంశం అనేది చివరికి కోడెల టీడీపీ కి సపోర్ట్ గా అలాగే కన్నాకు మద్దతుగా ఉండేందుకు ఒప్పుకున్నారు.
వారి కలియిక చూసి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు కొంచం భయానికి లోనియ్యారని తెలుస్తుంది. ఎందుకంటె కోడెలకు సత్తెనపల్లి నియోజకవర్గం లో మంచి పట్టు ఉందన్న సంగతి ఆయనకు తెలుసు. కోడెల శివప్రసాద్ గారు ఎక్కడ నుండే గెలిచి స్పీకర్ గా 2014 ఎన్నికల్లో గెలిచారు. అలాగే మీడియా సమావేశంలో కన్నా, జీవీ మరియు కోడెల రాష్ట్రంలో జరుగుతున్న పెన్షన్ ఇష్యూ గూర్చి కూడా డిస్కస్ చేసారు.ఏదేమైనా కోడెల కలయిక అనేది టీడీపీ లో బూస్ట్ లా పనిచేస్తే అది అంబటికి మాత్రం ఒక ఉచ్చు లాగా పనిచేసినట్లే అని అక్కడి ప్రజల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: