సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్.. ఫ్యాన్స్ షాక్?

praveen
సాదరణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే ఈ లెవెల్లో క్రేజ్ ఉంటుంది కాబట్టే వారికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులందరూ కూడా తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా సినీ సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ అనేది తెరిచిన పుస్తకమే. ఏ హీరో హీరోయిన్ ఎవరితో నటిస్తున్నారు. ఏ సినిమా విడుదల కాబోతుంది అన్న విషయం దాదాపుగా అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్ లైఫ్ గురించి కాకుండా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి అందరూ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.

 ఈ క్రమంలోనే పర్సనల్ లైఫ్ లో జరిగే విషయాల్లో ఏదైనా తెరమీదికి వచ్చింది అంటే చాలు అది కాస్త హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల ప్రేమాయణాలు పెళ్లిళ్లు అనేవి ఎప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోతూ ఉంటాయి. అయితే చాలామంది హీరో హీరోయిన్లు తమ పెళ్లి విషయం అభిమానులకు చెప్పి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం అభిమానులకు తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి తంతు కానిచ్చేసి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ఉంటారు. ఇలాంటి ట్విస్ట్ ఎవరైనా ఇచ్చారు అంటే చాలు వారి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.

 అయితే ఇటీవలే ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా అభిమానులకు ఇలాంటి షాక్ ఇచ్చింది. హీరోయిన్ సునయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవల తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు సోషల్ మీడియాలో రింగులు మార్చుకున్న ఫోటోని ఆమె షేర్ చేశారు. అభిమానులకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే కాబోయే భర్త ఎవరనేది మాత్రం.. ఈ హీరోయిన్ బయట పెట్టలేదు. కాగా కుమార్ vs కుమారి, టెన్త్ క్లాస్, రాజరాజ చోర లాంటి సినిమాలలో నటించారు సునయన. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ మలయాళ తమిళ సినిమాల్లో కూడా నటించారు. ఇక కొన్ని వెబ్ సిరీస్ లలో  కూడా నటించి ప్రేక్షకులను అలరించారు హీరోయిన్ సునయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: