విజ‌యాలు-స‌వాళ్లు: వీళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు ... బాబుకు టెన్ష‌న్ మొద‌లైపోయిందా..!

RAMAKRISHNA S.S.
- జ‌న‌సేన‌కు 5, బీజేపీకి 2 మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల్సిందే
- టీడీపీకి బెర్త్‌లు త‌క్కువ‌... పోటీ ఎక్కువ‌
- సీనియ‌ర్ల‌తో బాబుకు త‌ల‌నొప్పులు త‌ప్ప‌వా..!
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
త్వ‌ర‌లోనే ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు కానుంది. ఈ నెల 12న చంద్ర‌బాబు నేతృత్వంలో స‌రికొత్త పాలన ప్రారంభం కానుంది. దీనిపై టీడీపీ శ్రేణులు నాయ‌కులు కూడా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ప్ర‌భుత్వం ఏర్ప‌డు తుంది. కానీ, స‌ర్కారు ఏర్ప‌డిన నాటి నుంచే స‌వాళ్లు కూడా తెర‌మీదికి వ‌స్తున్నాయి. చంద్ర‌బాబు కేబినెట్‌లో ఆయ‌న‌తో క‌లిపి 26 మంది మంత్రుల‌ను తీసుకునే అవ‌కాశం ఉంది. వీరిలో బీజేపీ ఇప్ప‌టికే ఇద్ద‌రిని తీసుకోవాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. దీనికి సంబంధించి కేంద్రం నుంచి పెద్ద‌లు కూడా డైరెక్ష‌న్ ఇచ్చార‌ని తెలిసింది.

అంటే.. ఇద్ద‌రికి ఖ‌చ్చితంగా బీజేపీ నేత‌ల‌కు మంత్రిప‌ద‌వులు ఇవ్వాలి. ఇక‌, మిగిలిన 23 మందిలో ఐదు మంత్రి ప‌ద‌వుల‌ను జ‌న‌సేన కోరుతున్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. తెనాలి నుంచి విజ‌యం ద‌క్కించుకున్న నాదెండ్ల మ‌నోహ‌ర్‌, అవ‌నిగ‌డ్డ నుంచి గెలిచిన మండ‌లి బుద్ధ ప్ర‌సాద్‌, కాకినాడ రూర‌ల్ నుంచి గెలిచిన పంతం నానాజీ, తాడేప‌ల్లి గూడెం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న బొలిశెట్టి శ్రీనివాస్‌, నెల్లి మ‌ర్ల నుంచి విజ‌యంద‌క్కించుకున్న లోకం మాధ‌వి లేదా.. అన‌కాప‌ల్లి నుంచి విజ‌యం ద‌క్కించుకున్న కొణ‌తాల రామ‌కృష్ణ‌ల‌కు ప‌ద‌వులు ఇవ్వాల‌న్న ష‌రతులు వినిపిస్తున్నాయి.

దీంతో ఈ ఐదు కూడా.. పోతే.. ఇక‌, మిగిలేది 18 సీట్లు మాత్ర‌మే. వీటితోనే 135 మంది టీడీపీ నేత‌ల్లో మంత్రుల‌ను స‌ర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే చాలా మంది సీనియ‌ర్లు రెడీగా ఉన్నారు. టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు, నారా లోకేష్, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, ర‌ఘురామ‌కృష్ణ‌రాజు(ఉండి నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు), చిన్న‌రాజ‌ప్ప‌, లేదా బుచ్చ‌య్య చౌద‌రి, గుంటూరు నుంచి ధూళిపాళ్ల న‌రేంద్ర, య‌ర‌ప‌తి నేని శ్రీనివాస‌రావు, జీవీ ఆంజ‌నేయులు వంటివారు ఆదుర్దాగా ఎదురు చూస్తు న్నారు. ఈ ద‌ఫా త‌మ‌కు ఖాయ‌మ‌ని అనుకుంటున్నారు. అయితే.. వీరిలో ఇద్ద‌రికి ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

ఇక‌, మ‌హిళ‌ల కోటాలో రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత‌కు బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అంటున్నారు. ఇక‌, విశాఖ జిల్లా పాయ‌క‌రావు పేట నుంచి గెలిచిన‌.. వంగ‌ల‌పూడి అనిత కూడా ఈ జాబితాలో ముందున్నారు. ఇక‌, య‌న‌మ‌ల దివ్య పేరు వినిపిస్తోంది. ఇలా.. చాలా మంది మంత్రి వ‌ర్గ రేసులో ముందున్నారు. మ‌రి వీరిలో ఎంత మందిని స‌ర్దు బాటు చేస్తారు? ఎంత‌మందికి అవ‌కాశం ఇస్తారు? అనేది ప్ర‌శ్న కొత్త వారికి ఇచ్చి.. సీనియ‌ర్ల‌కు ఇవ్వ‌క‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వు. అలాగ‌ని అంద‌ర‌నీ సీనియ‌ర్ల‌తో నింపేస్తే.. అధికార కేంద్రాలు ఏర్ప‌డుతాయి. మొత్తంగా చూస్తే.. కేబినెట్ కూర్పులోనే చంద్ర‌బాబు పెద్ద స‌వాళ్లు ఎదురు కానున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: