విజ‌యంతో కూడిన స‌వాళ్లు: ఆ పార్టీలతో ప్రయాణం..బాబుకు సముద్రంలో ఈదడమేనా ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో... తెలుగుదేశం కూటమి సంచలనమే సృష్టించింది. అసలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా అన్న స్థాయి నుంచి.... ఇప్పుడు కేంద్ర రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదిగింది. ఐదు సంవత్సరాల వైసిపి పార్టీని... తునాతునకలు చేసింది తెలుగుదేశం కూటమి. అయితే అఖండ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు... అసలు సవాళ్లు ముందు ఉన్నాయి. ఏపీలో అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే... ఈ ఐదు సంవత్సరాలు పరిపాలించడం... మరొక ఎత్తు.

వైసిపి పార్టీని ఓడించేందుకు... తెలుగుదేశం, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలు ఏకమయ్యాయి. ఇందులో ఏ పార్టీ కలవకపోయినా... గెలుపు కోసం సహకరించక పోయినా వైసిపి మరోసారి గెలిచేది. అంటే ఈ గెలుపులో...  మూడు పార్టీలకు సమానమైన పాత్ర ఉంది. కాబట్టి మరో ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా ఈ మూడు పార్టీలకు.. సరైన అవకాశాలు అలాగే హక్కులు కల్పించాలి. ఇప్పుడు ఆ బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడు పైన ఉంటుంది. 134 స్థానాలు సంపాదించుకున్న  చంద్రబాబు నాయుడు... ఒంటెద్దు పోకడ పోకుండా... పవన్ కళ్యాణ్ అలాగే భారతీయ జనతా పార్టీలను.. ప్రతి విషయంలోనూ వారి పాత్ర ఉండేలా చూసుకోవాలి.

మొట్టమొదటగా మంత్రి పదవులు ఇచ్చే సమయంలో... చాలా కష్టపడ్డ జనసేన పార్టీకి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి. 5 మంత్రి పదవులు జనసేనకే ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుతో సమానంగా ఉండే పదవి ఇవ్వాలి. జనసేన, బీజేపీ పార్టీల నేతలకు కింది స్థాయిలో పోస్టులు కూడా ఇవ్వాలి. టీడీపీ నేతల కంటే..జనసేన, బీజేపీ నేతలకు ప్రభుత్వ పదవులు వచ్చేలా చూసుకోవాలి. ఎక్కడ కూడా జన సైనికులకు, జనసేన పార్టీ నేతలకు అవమానాలు జరగకూడదు.

అటు భారతీయ జనతా పార్టీ నాయకులకు... చంద్రబాబు అండగా ఉండాలి. ఈ రెండు పార్టీలకు పెద్దన్నగా ఉండి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డెవలప్మెంట్ చేయాలి. ఒకవేళ...  జనసేన పార్టీ లేదా బిజెపి నేతలకు అన్యాయం జరిగేలా చంద్రబాబు వ్యవహరిస్తే... ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. అలా జరిగితే... ఏపీలో వైసీపీకి  మళ్లీ ఊపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. చంద్రబాబు ఏం మాట్లాడినా... పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా ఉండకూడదు. ఈ ఐదు సంవత్సరాల పాటు.. జనసేన అలాగే బిజెపి పార్టీలతో  చంద్రబాబు చాలా జాగ్రత్తగా నడవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: