విజ‌యాలు - స‌వాళ్లు: అమ‌రావ‌తి పూర్త‌వ్వాలంటే చంద్ర‌బాబు ఈ గండాలు గ‌ట్టెక్కాల్సిందే..!

RAMAKRISHNA S.S.
- సుప్రీంలో వైసీపీ వేసిన కేసులు వెన‌క్కు తీసుకోవాల్సిందే
- ఆర్‌-5 జోన్‌లో 25 వేల మందికిచ్చిన ఇళ్ల స్థ‌లాలు వెన‌క్కి తీసుకుంటారా ?
- కౌలు రైతుల‌కు పేరుకుపోయిన రు. 2 వేల కోట్ల బ‌కాయిలు
- కాంట్రాక్టు సంస్థ‌లను ర‌ప్పించ‌డం బాబుకు పెద్ద స‌వాలే
(  విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వానికి నాయ‌క‌త్వం వ‌హించే టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు తొలి ద‌శ‌లో ఎదుర‌య్యే పెను స‌వాలు అమ‌రా వ‌తి రాజ‌ధాని. దీనిని నిర్మించి తీరుతామ‌ని ఆయ‌న ఎన్నికల స‌మ‌యంలోనే హామీ ఇచ్చారు. ఇది అమ‌రావ‌తి రైతుల్లో ఆనం దం నింపింది. ఫ‌లితంగా ఈవీఎంల‌లో ఓట్ల‌ను కురిపించింది. అయితే..ఇప్పుడు ఏపీ రాజ‌ధాని విష‌యంలో ముందుకు వెళ్లేందు కు ఒక‌ర‌కంగా.. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఉన్నాయి. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో కేసులు వేసింది. వీటిని వెన‌క్కి తీసుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేయాలి. కానీ, రేపు క‌క్షిదారుగా.. వైసీపీ నేత‌లు చేరితే.. ఇది మ‌రోసారి వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది.

ఇక‌, ఇప్ప‌టికే అమ‌రావ‌తిలోని ఆర్‌-5 జోన్‌లో 25 వేల మంది పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చారు. ఇక్క‌డ కొన్ని నిర్మాణాలు కూడా వారు చేసుకున్నారు. అయితే.. సుప్రీంకోర్టు తీర్పు మేర‌కు ఇది ఆధార‌ప‌డి ఉంటుంద‌ని తెలిసిందే. ఈ తీర్పు తేలినా.. పేద‌ల త‌ర‌ఫున మ‌రోసారి వైసీపీ నాయ‌కులు కానీ.. స్వ‌చ్ఛంద సంస్థ‌లు కానీ.. లేదా పేద‌లే కానీ.. కోర్టుకు వెళ్తే.. ఆర్‌-5 జోన్ వ్య‌వ‌హారం మ‌రోసారి ర‌గ‌డ‌కు దారి తీయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో పేద‌ల‌కు ఇచ్చిన భూముల‌ను లాగేసుకుంటున్నా రంటూ.. వైసీపీ నేత‌లు యాగీ చేయ‌డం ఖాయం. ఇది కొత్త‌గా వ‌చ్చిన టీడీపీ కూట‌మి స‌ర్కారుకు పెద్ద త‌ల‌నొప్పిగా మారే చాన్స్ క‌నిపిస్తోంది.

దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు కూడా.. మ‌రో ఆరు మాసాల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇదిలావుంటే..అమ‌రావ‌తిలో ఇప్ప‌టికే అనేక సంస్థ‌లు వెన‌క్కి వెళ్లిపోయాయి. అవి తిరిగి రావాలంటే.. ఇప్పుడు ప్ర‌భుత్వం త‌న వంతుగా ప్ర‌చారం చేయాల్సి ఉంటుంది. అయితే.. స‌ర్కారు త‌ర‌ఫున ఎంత చెప్పినా.. ఇక్క‌డ నిర్మాణాలు ప్రారంభం అయితే త‌ప్ప‌.. అది సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. కానీ.. ప‌నులు చేసేందుకు మ‌రోసారి ప్లాన్‌రెడీ చేసుకోవాలి.. కాంట్రాక్టు సంస్థ‌ల‌ను ఆహ్వా నించాలి. వాటికి నిధులు.. ఇత‌ర‌త్రా  సౌక‌ర్యాలు ఏర్పాటు చేయాలి.. ఇలా ఏవిధంగా చూసుకున్నా మ‌రో ఏడాది పాటు ఖ‌చ్చితంగా స‌మ‌యం తీసుకుంటుంది.

ఈలోగా.. రైతుల‌కు చెల్లించాల్సిన కౌలు బ‌కాయిలు.. చాలానే పేరుకుపోయాయి. ఇవి దాదాపు రెండు వేల కోట్ల వ‌ర‌కు ఉంటుంద ని అంచ‌నా. వీటిని చెల్లించాలి. అదేవిధంగా వారికి ఇవ్వాల్సిన భూములను డెవ‌ల‌ప్ చేసి ఇస్తే త‌ప్ప‌. కోర్టుల్లో ఉన్న కేసులు తేలేలా లేవు. ఇవి కూడా.. చంద్ర‌బాబు స‌ర్కారుకు సవాళ్లుగా మార‌నున్నాయి. అంటే.. అమ‌రావ‌తి నిర్మాణం.. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టుగా ఇప్ప‌టికిప్పుడు తేలిపోయే వ్య‌వ‌హారం కాద‌ని తెలుస్తోంది. కోర్టు చిక్కులు.. ఆర్‌-5 జోన్ వ్య‌వ‌హారం.. పేద‌ల‌కు వేరే చోట ఇళ్ల కేటాయింపు. కోర్టులో కేసుల వివాదాలు.. వాద ప్ర‌తివాదాలు.. ఇవ‌న్నీ తేలితే.. త‌ప్ప‌.. రాజ‌ధాని నిర్మాణం ముందుకు సాగేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు పరిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: