కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు.. చంద్రబాబు నయా ప్లాన్?

praveen
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని పార్టీగా ఎదిగింది అన్న విషయం తెలిసిందే. తెలంగాణ తెచ్చింది అనే సెంటిమెంట్ తో ఏకంగా రెండుసార్లు ఇక రాష్ట్ర ప్రజానీకం మొత్తం బిఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ఇదే సెంటిమెంటుతో మూడోసారి కూడా కారు పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మూడోసారి మాత్రం తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మలేదు. దీంతో మార్పు కోరుకున్న రాష్ట్ర ప్రజానీకం కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కారు పార్టీ ఒక్కసారి ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో.. చివరికి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే ఏకంగా ఆ పార్టీలోని కీలక నేతలు అందరూ కూడా కారు దిగి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. కారు పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇలా వలసలు వెళ్లి మరో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇలాంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటితే ఉన్న నేతలను అయినా కాపాడుకోవచ్చు అని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఇటీవల వెడువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో కారు పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఒక్కచోట కూడా అటు బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించలేకపోయింది. దీంతో ఆ పార్టీ పని అయిపోయింది అంటూ అటు రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

 ఇలాంటి సమయంలో అఖండ విజయంతో ఆంధ్రాలో టిడిపి అధికారంలోకి రావడం.. చంద్రబాబు సీఎం కావడంతో.. ఇక ఇప్పుడు తెలంగాణపై కూడా ఆయన దృష్టి పెట్టారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు టిడిపి ఎత్తుగడలు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటమితో కారు పార్టీ డీల పడిపోవడంతో ఇక తెలంగాణలో బలపడేందుకు ఇదే సరైన సమయం అని చంద్రబాబు అనుకుంటున్నారట. ఇప్పటికే దీనికోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఇప్పటికీ కార్యకర్తలు టిడిపి తోనే ఉండడంతో.. బిఆర్ఎస్ లోని కొంతమంది నేతలను టిడిపిలోకి ఆహ్వానించాలని అనుకుంటున్నారట చంద్రబాబు. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని టిడిపి నిర్ణయించుకుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: