భారీ విజయం కాదు బాబుగారు, ముందున్న సవాళ్లు ముఖ్యం?

Purushottham Vinay
•బాబు ముందు భారీ సవాళ్లు 

•పెండింగ్లో పోలవరం ప్రాజెక్ట్ పనులు

•అమరావతి కోసం ఆశగా చూస్తున్న ఆంధ్రులు


తెలుగు దేశం అధినేత చంద్ర‌ బాబు నాయుడు గారు ఊహించని విధంగా భారీ మెజారిటీతో తనని తన కుటుంబాన్ని దారుణంగా అవమానించిన వైసీపీని ప్రధాన ప్రతి పక్షానికి కూడా పనికి రాకుండా చిత్తు చిత్తుగా ఓడించి అద్భుతమైన, అఖండమైన విజయం సాధించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి సీటుని సునాయాసంగా గెలిచాడు... వైసీపీ పతనమే టార్గెట్ గా చేసుకొని వైసీపీ నాయకులతో శపధం చేసి మరీ గెలిచాడు. వైసీపీని అంతం చేసేందుకు బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకొని కూటమిగా ఏర్పడి జగన్ పార్టీ పై దండయాత్ర చేసి అఖండ విజయం సాధించి పోగొట్టుకున్న తన అధికారాన్ని మళ్ళీ దక్కించుకున్నాడు బాబు. 135 సీట్లు టీడీపీ గెలవగా, జనసేన 21 సీట్లు, బీజేపీ 8 సీట్లు గెలిచాయి. వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచి చాలా దారుణంగా ఓడిపోయింది. అయితే భారీ విజయం సాధిస్తే సంబరం కాదు. వైసీపీకి ప్రతి పక్షంగా ఏ పార్టీ ఉన్నా గెలిచేది. అక్కడ వైసీపీ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదు కాబట్టే బాబు కూటమి గెలిచింది. కానీ గెలిచినంత మాత్రాన చంకలు గుద్దుకుంటే సరిపోదు. ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. వాటిని గెలిస్తేనే అసలైన విజయం సాధించినట్టు. ఎందుకంటే చంద్రబాబు ముందు భారీ విజ‌యం క‌న్నా చాలా స‌వాళ్లు ఎక్కువగా ఉన్నాయి.. వాటిని ఎదురుకుంటేనే నిజంగా గెలిచినట్టు.


ఉద్యోగుల‌కు హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, రాజ‌ధాని విష‌యంలో అమ‌రావ‌తి అని ప‌ట్టుబ‌ట్టారు బాబు. ఇప్పుడు అమ‌రావ‌తి నిర్మాణం అనేది ఆయనకి ఓ పెద్ద స‌వాల్‌ అయ్యింది. అమరావతి నిర్మాణం అంత తేలిక కాదు. కానీ దాన్ని బాబు ఈ 5 ఏళ్లలో పూర్తి చెయ్యాలి. లేదంటే విశాఖని రాజధానిగా మార్చాలి. అదెలాగో బాబు చెయ్యడు. కాబట్టి ఖచ్చితంగా అమరావతిని నిర్మించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజల నుంచి అనేక రకాల అవమానాలు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా పక్కనున్న తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదని ఆంధ్ర ప్రజల సిగ్గు తీస్తున్నారు.కాబట్టి హైదరాబాద్ కి ధీటుగా బాబు అమరావతిని నిర్మించాలి. అలాగే ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పోల‌వ‌రం ప్రాజెక్టుని పూర్తి చేసి తీరాలి. అలాగే వాలంటీర్ల‌ను కంటిన్యూ చేస్తామ‌ని చెప్పి పైగా 10 వేల‌కు జీతాలు పెంచుతామ‌ని చెప్పారు. కాబట్టి వీటిని అమలు చేసి తీరాలి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని అరికట్టాలి. పాఠశాలలని జగన్ లాగా అభివృద్ధి చెయ్యాలి. విద్యార్థుల పైచదువులు నాణ్యంగా ఉండేలా చూసుకోవాలి. రైతులకి అండగా ఉండాలి. పేద వాళ్లకి నాణ్యమైన వైద్యం అందించే విధంగా కృషి చెయ్యాలి. ఉచితంగా ఇల్లులు కట్టించాలి. పిచ్చి పిచ్చి పథకాలు పెట్టకుండా జనాల భవిష్యత్తు బాగుండేలా మంచి మంచి పథకాలు పెట్టాలి. రాబోయే 5 ఏళ్లల్లో ఈ సవాళ్ళని బాబు అధిగమిస్తేనే మరో పదేళ్లు అధికారంలో ఉంటారు. లేదంటే ప్రజలు తీర్పుతో పతనం అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: