అప్పట్లో బహిష్కరణ కోసం.. ఎలక్షన్స్ జరిగేట తెలుసా?

praveen
ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా కూడా ఎలక్షన్స్ హడావిడి ఎక్కువగా కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇక ఈసారి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు  ఇక అన్ని పార్టీల కార్యకర్తలు కూడా తమ పార్టీని గెలిపించుకునేందుకు ఇక అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక పార్టీ పెద్దలు అందరూ కూడా దేశం మొత్తం తిరుగుతూ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు.

 ఇక ఎప్పటిలాగానే అన్ని పార్టీలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పార్లమెంటు ఎన్నికల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓటరు మహాశయులందరూ కూడా ఇక తమకు నచ్చిన నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఓటింగ్ గురించి ఏ విషయం తెర మీదకి వచ్చినా కూడా హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఎలక్షన్స్ అంటే తమను పరిపాలించే నాయకుడిని ప్రజలే ఓటు వేసి ఇష్టానుసారంగా ఎన్నుకోవడం అన్న విషయం తెలిసిందే.

 అయితే ఈ ఓటింగ్ అనేది అసలు ఎప్పుడు ఎక్కడ పుట్టింది అన్నది ఎవరికీ తెలియదు  అయితే ఎన్నికల వ్యవస్థకు మూలాలు గ్రీకు దేశంలో ఉన్నాయని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అయితే పురాతన గ్రీస్ లో బహిష్కరణ కోసం ఇక ఈ ఎలక్షన్స్ పద్ధతిని వాడే వారట. సుమారు 58 బీసీ కాలంలో ఈ నెగెటివ్ ఎలక్షన్స్ జరిగినట్లు చరిత్రలో రికార్డ్స్ కూడా ఉన్నాయట. భూస్వాములు తమకు నచ్చనీ రాజకీయ నాయకుడి పై మరో ఐదేళ్లపాటు బహిష్కరణ విధించేందుకు ఏటా ఇలాంటి ఎన్నికలు నిర్వహించే వారట. 6 వేలకు మించి గరిష్టంగా ఎవరికైతే ఓట్లు వస్తాయో.  ఇక వారిని ఐదేళ్లపాటు బహిష్కరణ చేసేవారట. ఇలా అప్పటినుంచి ఎన్నికలు కొనసాగుతూ వస్తూ.. ఇక ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా ఇలా తమను పరిపాలించే నాయకుడిని ఎన్నుకునేందుకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: