చైనా వల్లే సరిహద్దుల్లో రక్తపాతం.. జైశంకర్ షాకింగ్ కామెంట్స్?

praveen
రెండు మూడేళ్ల కిందటి వరకు కూడా భారత్ కు చిరకాల శత్రువైన దేశం ఏది అంటే కేవలం పాకిస్తాన్ పేరు మాత్రమే చెప్పేవారు అందరూ  కానీ ప్రస్తుత పరిస్థితుల దృశ్యం మాత్రం ఇలా భారత్ కి చిరకాలశత్రువు అనే లిస్టులోకి అటు చైనా కూడా చేరిపోయిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఇరుదేశాల సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఏకంగా అక్రమంగా భారత భూభాగంలోకి చొరబడిన చైనా సైనికులు.. ఏకంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన భారత సైనికులు వారికి గట్టిగానే బుద్ధి చెప్పారు.

 దీంతో సరిహద్దుల్లో తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయ్ అని చెప్పాలి. ఇక ఎప్పటికప్పుడు చైనా ఆటలకు అడ్డుకట్ట వేస్తూ భారత సైనికులు అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తూనే ఉన్నారు. ఇక ఒకానొక సమయంలో అయితే ఇరుదేశాల మధ్య యుద్ధం జరుగుతుందేమో అనే విధంగానే పరిస్థితులు మారిపోయాయి. సరిహద్దులో ఇరుదేశాలు భారీగా ఆయుధాల మొహరింపు కూడా చేపట్టాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్, చైనా సరిహద్దుల మధ్య నెలకొన్న పరిస్థితుల గురించి ఇండియా విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఇటీవలే మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా కారణంగా 2020లో గాల్వాన్ లో ఏకంగా రక్తపాతం చోటు చేసుకుంది అంటూ జయశంకర్ అన్నారు.

 1975 నుంచి 2020 మధ్య కాలంలో ఎన్నడూ కూడా సరిహద్దుల్లో రక్తం చుక్క కూడా చిందలేదు. కానీ 2020 తర్వాత మాత్రం సరిహద్దుల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సరిహద్దుల విషయంలో అటు ఇరుదేశాల మధ్య ఉన్న రాతపూర్వక ఒప్పందాలను బీజింగ్ తుంగలో తొక్కింది. దౌత్య సంబంధాల్లో ఉన్న స్థిరత్వాన్ని చైనా తమ తీరుతో ప్రమాదంలోకి నెడుతుంది అంటూ జయశంకర్ వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి లేదని.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అటు చైనాకు సరైన బుద్ధి చెబుతాం అంటూ జయశంకర్ వ్యాఖ్యానించాడు. కాగా గత కొంతకాలం నుండి భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దేశాల అన్నింటితో కూడా స్నేహం చేసేందుకు చైనా శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: