భారత్‌ను చూసి నేర్చుకోండి.. పాక్‌ మేధావుల ఆగ్రహం?

Chakravarthi Kalyan
సాధారణంగా భారతదేశానికి, పాకిస్తాన్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పాకిస్తాన్లో  ఉన్నటువంటి కొంతమంది  జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు ఇప్పుడు తాము ఉండే పాకిస్తాన్ ను తిట్టి పోస్తున్నట్లు తెలుస్తుంది. వాళ్లు షాబా షరీఫ్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మీరూ ఇమ్రాన్ ఖాన్ కొట్టుకుంటూ పాకిస్తాన్ ని గాలికి వదిలేసారని అంటున్నారట. నిజానికి మనకూ భారత దేశానికి ఒకేసారి స్వాతంత్రం వచ్చింది.

అయితే స్వాతంత్రం వచ్చి 75ఏళ్లు  గడుస్తున్న ఈ టైంలో పాకిస్తాన్ తీవ్రవాదానికి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందితే, భారత్ మాత్రం ఆర్థిక శక్తిగా పుంజుకుంటుంది అని వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత్ ను ప్రపంచ పటంలో  పేరొందేలా తయారు చేస్తుంటే, మీరు మాత్రం పాకిస్తాన్ అంటేనే తీవ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా మార్చేస్తున్నారు అంటూ వాళ్ళు వాపోతున్నట్లుగా తెలుస్తుంది.

విద్య, ఉద్యోగం, ఉపాధి  ఈ రంగాల్లో ఉన్నతంగా ఉండాలంటే విదేశాలకు వెళ్ళాలి గాని పాకిస్తాన్లో ఉండి చేయలేని పరిస్థితి. ప్రపంచ దేశాల ముందు అప్పుల కోసం అర్థించే దేశంగా నిలబెట్టారు అంటూ జర్నలిస్టులు కూడా కాలమ్స్ రాస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ పై ఈ విధంగా  మాట్లాడే వ్యక్తులపై షాభా షరీఫ్ ప్రభుత్వం దేశ ద్రోహ నేరం మోప బోతున్నట్లుగా తెలుస్తుంది.

అందుకే వాళ్ళు తెలివిగా భారత్ ను కాకుండా పాకిస్తాన్ నుండి వేర్పడిన బంగ్లాదేశ్ ను ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారట.  బంగ్లాదేశ్ ను ఈస్ట్ పాకిస్తాన్ అని పిలుస్తారు. ఎందుకంటే అది 1971లో పాకిస్తాన్ నుండి విడివడిన దేశం. అప్పుడు బంగ్లా మాట్లాడే సియాలు ఇంకా సుమీ వర్గాల మధ్య గొడవలు మొదలైనప్పుడు వాళ్లు పాకిస్తాన్ నుండి భారత్ కు చేరుకుంటూ ఉంటే వాళ్లని భారత్ లోకి రానివ్వకుండా, పాకిస్తాన్ తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ వాసుల కోసం ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసింది ఇందిరా గాంధీ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: